Share News

వరినాట్లు వేసిన ‘మన్యం’ కలెక్టర్‌

ABN , Publish Date - Aug 19 , 2024 | 05:38 AM

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం కలెక్టర్‌ శ్యారమ్‌పసాద్‌ పర్యటించారు. ఈ సందర్భంగా గొరడ గిరిజన గ్రామంలో రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు.

వరినాట్లు వేసిన ‘మన్యం’ కలెక్టర్‌

పార్వతీపురం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం కలెక్టర్‌ శ్యారమ్‌పసాద్‌ పర్యటించారు. ఈ సందర్భంగా గొరడ గిరిజన గ్రామంలో రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు.

అనంతరం జీవామృతం తయారీలో భాగస్వాములయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్న ఆయన గిరిజన రైతులతో మాట్లాడి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వ్యవసాయం అంటే తనకెంతో ఇష్టమని, జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. గిరిజన రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉండాలని సూచించారు.

పండించిన పంటలకు ఆన్‌లైన్‌ ద్వారా మార్కెట్‌ సదుపాయం కల్పించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. సేంద్రియ పద్ధతిలో పసుపు, ముల్లంగి, చింతపండు తదితరాలను సాగు చేయాలని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Aug 19 , 2024 | 05:38 AM