Share News

Y S Jagan: రాయి... కిరాయి.. కథ, స్క్రీన్‌పై, దర్శకత్వం.. ?

ABN , Publish Date - Apr 14 , 2024 | 06:38 PM

2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌... 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా నాటి ఘటనలనే ఫాలో అవుతున్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఏఫ్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడలోని సింగ్ నగర్‌లో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై ఆగంతకులు రెండు రాళ్లు వేశారు.

Y S Jagan: రాయి... కిరాయి.. కథ, స్క్రీన్‌పై, దర్శకత్వం.. ?
YS Jagan Mohan Reddy

2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌... 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా నాటి ఘటనలనే ఫాలో అవుతున్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఏఫ్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడలోని సింగ్ నగర్‌లో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయనపై ఆగంతకులు రెండు రాళ్లు వేశారు. ఓ రాయి వైయస్ జగన్‌కు తగలగా.. మరో రాయి ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు తగిలింది. ఇద్దరికి తల భాగం, కంటి వద్ద తగలడం గమనార్హం. అయితే రాయి తగలడంతో.. వైయస్ జగన్ ఎడమ కంటి పైబాగం కొద్దిగా చీలింది. అనంతరం వైద్యులు ఆ గాయానికి మూడు కుట్లు వేశారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై రాయితో దాడి.. పోలీసుల అదుపులో వ్యక్తి


అయితే 2019 ఎన్నికల ముందు కూడా ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కోడి కత్తి దాడి జరిగింది. ఆ వెంటనే ఆయన విమానంలో హైదరాబాద్ వచ్చి.. చికిత్స చేయించుకున్నారు. అప్పుడు కూడా ఆయన భుజానికి అయిన గాయానికి జస్ట్ కుట్లు పడ్డాయని గుర్తు చేస్తున్నారు. ఈ రెండు ఎపిసోడ్‌లలో వైయస్ జగన్ వ్యవహరించిన తీరు ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మరో ఎత్తు అని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ వాడి వేడిగా నడుస్తోంది.

ఎందుకంటే... ఎన్నికల ప్రచారంలో బస్సుపై సీఎం వైయస్ జగన్ ఒక్కరే లేరు. ఆయన పక్కన భద్రత సిబ్బందితోపాటు పలువురు నాయకులు ఉన్నారు. కానీ ఆ ఆగంతకులు విసిరిన రెండు రాళ్లు.. ఈ ఇద్దరు నేతలకు తగలడం గమనించాలి. అనంతరం వైయస్ జగన్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి.. వైద్యులతో ఆ గాయానికి కుట్లు వేయించుకున్నారు.

AP Election 2024: ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కారణమిదే..!


ఈ సందర్భంగా వైద్యులతోపాటు ఆసుపత్రి సిబ్బందితో కలిసి సీఎం వైయస్ జగన్ చిరునవ్వుతో ఫోటోకు ఫోజ్ ఇచ్చారు. మరోవైపు గాయానికి కుట్లు వేసే సమయంలో తీసిన వీడియోలు, ఫొటోలు సైతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇక గాయం వల్ల సీఎం జగన్‌కు ఎటువంటి ప్రమాదం లేదు.. జస్ట్ ఒక రోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు ప్రకటించారు. దీంతో వైయస్ జగన్‌పై జరిగిన దాడి తాలుకు సీరియస్‌నెస్.. ఇట్స్ గాన్.. అన్నట్లుగా ప్రజల మనస్సుల్లో నుంచే కాదు.. వారి మైండ్ నుంచి తొలగిపోయింది.

కానీ 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇదే వైయస్ జగన్‌పై కోడి కత్తి దాడి జరిగింది. ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. అంటే ఆంధ్ర పోలీసుల మీద తనకు నమ్మకం లేదన్నారు. విశాఖ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. లోటస్ పాండ్‌లోని ఆయన నివాసం పక్కనే ఉన్న ఆసుపత్రిలో చేరి..ఆ ఆసుపత్రి వైద్యులతో కుట్లు వేయించుకున్నారు.

CBN: వైసీపీని భూస్థాపితం చేయాలి.. పిలుపునిచ్చిన చంద్రబాబు


ఆ సమయంలో ఆసుపత్రిలో తీసిన ఫోటోలు సైతం వైరల్ అయినాయి. అంటే నాడు నమ్మకం లేని ఆంధ్రా పోలీసులను నేడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిపై వైయస్ జగన్‌కు నమ్మకం వచ్చిందా? అందుకే ఈ దాడి జరిగినా ఆయన పోలీసుల వ్యవహార శైలిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదా అనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోంది.

మరోవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యటన అంటే.. కరెంట్ కట్‌లు ఉండవు. అలాంటిది రాయి దాడి జరిగిన రోజు విజయవాడలోని సింగ్ నగర్‌ ప్రాంతంలో వరుసగా 4 సార్లు కరెంట్ పోయిందని తెలుస్తోంది. అంటే ఎక్కడ లోపం ఉంది. పోలీసుల్లోనా? లేక ప్రభుత్వ ఆధికారుల్లోనా? అనే ఓ చర్చ అయితే నడుస్తోంది.

అదీకాక సింగ్ నగర్ ప్రాంతం గంజాయి కిరాయి మూకల ఆగడాలకు అడ్డా అని ఇప్పటికే నగరంలో ఓ టాక్ అయితే ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆగంతకులు రాళ్లు విసరడం.. తల భాగంలోనే కళ్లు ఉన్న ప్రాంతంలోనే ఈ ఇద్దరికి గాయాలు కావడం యాధృచ్చకమేనా? అంటే సందేహమేననే ఓ చర్చ సాగుతోంది. మరోవైపు ఈ రాళ్ల దాడిలో క్యాట్ బాల్‌ను ఆగంతకులు వినియోగించారనే ఓ చర్చ సైతం సాగుతోంది.

Iran-Israel war: ఇజ్రాయెల్‌లోని భారతీయుల కోసం..


ఇంకోవైపు గత ఎన్నికల్లో వైయస్ జగన్ వెంట అంతా ఉన్నారు.. అంటే పులివెందుల్లోని వైయస్ ఫ్యామిలీ మొత్తం జగన్ వెంటనే నడించింది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. అలాంటి వేళ.. మళ్లీ వరుసగా రెండో సారి అధికారం అందుకోవాలి. అందుకు సెంటిమెంటే అయింట్‌మెంట్ ఆయుధమన్న సంగతి ఈ వైసీపీ అధినేత వైయస్ జగన్‌‌కు బలంగా అర్థమైందనే ఓ చర్చ సైతం సాగుతోంది.

Devyani Khobrogade: కొత్త సంవత్సర వేడుకలు.. అప్సరగా దేవయాని

ఇక గత ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్, వైయస్ ఫ్యామిలీ, కోడికత్తి దాడితోపాటు వివేకా హత్యతో వచ్చిన సానుభూతి అన్ని హోల్‌సేల్‌గా వర్క్ అవుట్ అయ్యాయి. దీంతో వైసీపీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠంపై ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై ఆ అధికార పీఠాన్ని అధిరోహించారు.

మళ్లీ అధికారం అందుకోవాలి అదీ కూడా ప్రజాస్వామ్య బద్దంగా అందుకోవాలనే ఆకాంక్షతో రక్తం. కుట్లు, ఆసుపత్రి, వైద్యులు, విశ్రాంతి, గాయం వగైరా వగైరా వస్తువులను ముడి సరుకుగా చేసుకొని.. అధికారం అందుకోవాలని వైయస్ జగన్ ఆరాట పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకోసం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని తాడేపల్లి ప్యాలెస్‌ వేదికగా ఐ ప్యాక్ సారథ్యంలో సిద్ధమైనట్లు ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్‌గా నడుస్తోంది.

ఏఫీ వార్తలు కోసం..

Updated Date - Apr 14 , 2024 | 06:52 PM