అరకొర వైద్యంతో అవస్థలు
ABN , Publish Date - Sep 17 , 2024 | 11:26 PM
మదనపల్లె ‘ప్రభుత్వ సర్వజన బోధ నాస్పత్రి’ పేరుకే పెద్దాస్పత్రి కాని ఇక్కడ చిన్నచిన్న కేసులను కూడా తిరుపతికి రెఫర్ చేసేస్తున్నారు.
మదనపల్లె పెద్దాస్పత్రిలో చిన్న కేసులు కూడా రెఫరలే.. పలుచోట్ల సమ్మెలో పీహెచసీ వైద్యాధికారులు ఫవచ్చిన రోగులకు మందు బిళ్లలే శరణ్యం
పీలేరు నియోజకవర్గంలోనూ రోగుల పరిస్థితి దుర్భరం వైద్యుల కోసం రోగుల ఎదురుచూపులు వాల్మీకిపురం ఆస్పత్రి భవనంలో లిప్టులేక రోగుల పాట్లు
మదనపల్లె టౌన, సెప్టెంబరు 17:మదనపల్లె ‘ప్రభుత్వ సర్వజన బోధ నాస్పత్రి’ పేరుకే పెద్దాస్పత్రి కాని ఇక్కడ చిన్నచిన్న కేసులను కూడా తిరుపతికి రెఫర్ చేసేస్తున్నారు. అదేమంటే ఇక్కడ స్పెషలిస్టులు లేరని సమాధాన చెబుతారు...ఇదీ మదనపల్లె పట్టణంలోని సర్వజన బోధనా స్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యం తీరు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పీహచసీలు, సీహెచసీ, ప్రభుత్వాస్పత్రుల్లో మంగళ వారం ‘ఆంధ్రజ్యోతి విజిట్’లో పలు అంశాలు వెలుగు చూశాయి...
మదనపల్లె సర్వజన బోధనాస్పత్రిలో 1120 మంది రోగులు అవుట్ పేషెంట్లుగా వైద్య చికిత్సలు చేయించుకున్నారు. ఇక్కడ ఓపీ విభా గంలో 19 రకాల రోగాలకు వైద్యులు చికిత్సలు అందించారు. ముఖ్యం గా జ్వరబాధితులు పెద్దసంఖ్యలో రావడంతో వారికి ఓపీలోనే చికిత్సలు అందించి, ఇంజెక్షన్లు, మందులు ఇచ్చారు. కాకపోతే ప్రమాదాల్లో తల కు, శరీరానికి దెబ్బలు తిన్న వారికి సీటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ స్కానింగ్ ప్రభుత్వాస్పత్రిలో చేయకుండా ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు రెఫర్ చేస్తున్నారు. దీంతో పేద రోగులు చేతిలో డబ్బులు లేక, అప్పులు చేసి ప్రైవేటు స్కానింగ్‌సెంటర్లకు వెళుతున్నారు. ఇక్కడ ఇనపేషెంట్ల కోసం 440 పడకలు ఉండగా, వారందరికి చికిత్సలు అందించేందకు సరిపడా పరికరాలు, గ్లోవ్స్ కొనేందుకు బడ్జెట్ కేటాయించలేదు. దీంతో కొన్ని సందర్భాల్లో రోగులే బయట మందుల దుకాణాలకు వెళ్లి కొనుక్కో వాల్సిన దుస్థితి నెలకొంది. మదనపల్లె మండలంలో సీటీఎం, బొమ్మన చెరువు పీహెచసీలు ఉండగా సీటీఎం పీహెచసీలో సమయానికే వైద్యురాలు, సిబ్బంది హాజరై రోగులకు చికిత్సలు అందించారు. కాకుం టే పీహెచసీ ఆవరణలో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు ఏపుగా పెరిగి పోయి పాములు, విషకీటకాలకు నిలయంగా మారాయి. రాత్రి అయితే ఈ పీహెచసీకి రోగులు వచ్చేందుకు బయపడుతున్నారు. నిమ్మనపల్లె పీహెచసీలో వైద్యాధికారి రమేశబాబు ఇనచార్జి డిప్యూటీ డీఎంహెచవో గా మదనపల్లెలో విధులు నిర్వహణకు వెళ్లారు. మరో వైద్యురాలు ప్ర త్యూష విజయవాడలో వైద్యులు చేపట్టిన సమ్మెకు వెళ్లారని దీంతో ఇక్కడికి వచ్చిన రోగులకు నర్సులే డాక్టర్ల అవతారం ఎత్తి చికిత్సలు చేసి మందుబిళ్లలు ఇచ్చి పంపుతున్నారు. రామసముద్రం మండలంలో రామసముద్రం, బొమ్మనెచెరువు పీహెచసీలు ఉండగా ఇక్కడ వైద్యులు సకాలంలో వచ్చి రోగులకు చికిత్సలు అందించారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో...
తంబళ్లపల్లె నియోజకవర్గం అంటేనే జిల్లాలో మారు మూల గ్రామాల సమాహారం. ఆరు మండలాల్లో ఉన్న పీహెచసీల్లో వైద్యుల కొరత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. విధులకు హాజరయ్యే వైద్యులు జ్వరాలకు ఇతర రోగాలకు చికిత్సలు అందిస్తున్నారే కాని అత్యవసర కేసుల్లో కొన్నింటిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. బి.కొత ్తకోటలో పేరుకే 30 పడకల ఆస్పత్రి ఉన్నా సౌకర్యాలు శూన్యం. ముల కలచెరువు పట్టణం గుండా జాతీయ రహదారి వెళుతున్న క్రమంలో ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి విజిట్’లో పలుచోట్ల వైద్యులు సకాలంలో విధులకు హాజరు కాలేదు. వైద్యుల సమ్మెలో పాల్గొనేందుకు ములకల చెరువు, పెద్దమండ్యం పీహెచసీల వైద్యులు వెళ్లగా అత్యవసర చికిత్స లు మాత్రమే అందించారు కాని ఓపీ తక్కువగా చూశారు. ములకల చెరువులో ఇద్దరు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులే రోగులకు చికిత్సలు చేశారు. పెద్దమండ్యం పీహెచసీలో ఇద్దరు వైద్యు లు విధులకు హాజరు కాలేదు. మిగిలిన వైద్య సిబ్బంది 9.30 గంటలకు ఆలస్యంగా వచ్చారు. ఇక్కడ ఇద్దరు వైద్య సూపర్‌వైజర్లు బదిలీపై వెళ్లగా వారి స్థానంలో ఎవరిని నియమించలేదు. దీంతో క్షేత్రస్థాయిలో వైద్యసిబ్బంది సేవలు పర్యవేక్షణ కొరవడింది. రూ.25లక్షలతో నిర్మించిన ల్యాబ్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. బి.కొత్తకోటలో ఏడుగురు వైద్యులు విధులు నిర్వహించాల్సి ఉండగా, నలుగురు మాత్రమే విధు లకు హాజరయ్యారు. దీంతో రోగులకు సకాలంలో వైద్యసేవలు అంద డం లేదు. కందుకూరు, కురబలకోట పీహెచసీల్లో రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. సీరియస్ కేసులు రెఫర్ చేస్తున్నారు.
పీలేరులో వైద్యుల కోసం రోగులు నిరీక్షణ
పీలేరు, సెప్టెంబరు 17: పీలేరు మండలం రేగళ్లులోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో అన్ని వసతులు ఉన్నప్పటికీ వైద్యులు లేకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు. తమ డిమాండ్ల సాధన కోసం వైద్యులు సమ్మెలో ఉండడంతో గత కొన్ని రోజులుగా రేగళ్లు పీహెచసీ పరిధిలోని ప్రజలు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటల రేగళ్లు పీహెచసీలో ఇద్దరు వైద్యులు పనిచేస్తుండగా, ఒక రు ప్రతిరోజూ ఓపీలో, మరొకరు 104 వాహనంలో సేవలందిస్తుంటా రు. సగటున ప్రతిరోజూ రేగళ్లులో 60 మంది రోగులు వైద్యం పొందు తుంటారు. సాధారణ జబ్బులతోపాటు ఇక్కడ అత్యవసర సమయాల్లో కాన్పులు, విషపురుగుల కాటులకు వైద్యం అందిస్తున్నారు. పీహెచసీలో సరిపడా సిబ్బంది, మందులు ఉన్నప్పటికీ వైద్యులు లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందిగా మారింది.
గుర్రంకొండలో పేదలు వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షిస్తే కానీ ఉచిత వైద్యం అందడం లేదని రోగులు వాపోతున్నారు. గుర్రంకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటల ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో ఇద్ద రు డాక్టర్లు ఉన్నా ఆసుపత్రికి సకాలంలో రాకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆసుపత్రిలో స్టాప్ నర్స్‌ల కొరతతో సచివాలయాల్లో పని చేసే ఎంఎల్‌హెచపీలతో ఓపీ సేవలను చేయి స్తున్నారు. ప్రతి రోజు ప్రభుత్వ ఆసుపత్రికి 50 మందికి పైగా రోగులు వచ్చి వైద్య సేవలను చేయించుకుంటున్నారు. 24 గంటల ఆసుపత్రి కావడంతో రాత్రి పూట డాక్టర్ ఉండేలా చూడాలని రోగులు కోరుతు న్నారు. ఈ విషయమై డాక్టర్ రవీంద్రనాయక్ వివరణ కోరగా జిల్లా కేంద్రంలో చేస్తున్న ధర్నాకు తాము వెళ్లినట్లు తెలిపారు.
కలకడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు ఉండగా డాక్టర్ మల్లికార్జున మండలంలో జరుగుతున్న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమానికి నోడల్ అధికారిగా విధులపై వెళ్లినట్లు తెలి పారు. ఆసుపత్రిలో డాక్టర్ మోహన అందుబాటులో ఉంటూ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్టాప్ నర్స్, పార్మాసిట్, ల్యాబ్ టెక్నీషి యన పోస్టులకు సరిపడ్డ సిబ్బంది ఉన్నారు.
వాల్మీకిపురం ప్రభుత్వ వైద్యశాలలో 11 మంది డాక్టర్లకుగాను 9 మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. చిన్నపిల్లల వైద్యులు, జనర ల్ ఫిజీషియన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చిన్నపిల్లల వైద్యులు అం దుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ సగటున 200 మంది నుంచి 250 మంది వరకు వైద్య సాయం పొందుతున్నారు. పాత భవనాలలో ఉన్న ఐసోలేషన వార్డు నుందు గోడలు దెబ్బతిన్నాయి. రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రి నాలుగు అం తస్థుల భవనాలలో ప్రస్తుతం ప్రసూతి వార్డు, ఆపరేషన థియేటర్ తదితర అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చినా నూతన భవనాలకు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో అటు రోగులు, ఇటు వైద్య సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. నూతన భవనాలకు ఆర్వీ వాటర్ ప్లాంటు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంది. పోస్టుమా ర్టం అసిస్టెంట్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కలికిరి కమ్మూనిటీ హెల్త్ సెంటర్‌లో మొత్తం 10 మంది వైద్యులు పనిచేస్తుండగా అందులో ఒకరు మెటర్నిటీ సెలవులో ఉన్నారు. మరో ఇద్దరు వేర్వేరు డ్యూటీలతో ఓడీలో ఉన్నారు. మంగళవారం ఏడుగురు వైద్యులు డ్యూటీలో ఉన్నారు. అన్ని రకాల వైద్యులు అందుబాటులో ఉండడంతో ప్రసూతి కేసులను ఇతర ఆసుపత్రులకు పంపకుండా ఇక్కడే డెలివరీలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి పవన కుమార్ తెలి పారు. త్వరలో కొత్త భవనాలు అందుబాటులోకి వస్తే మరిన్ని సేవలు అందించేందుకు వీలవుతుందంటున్నారు. ప్రస్తుతం రోజూ 125 నుంచి 250 మంది వరకు ఓపీ ఉంటోంది.