Share News

హైకోర్టులో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ABN , Publish Date - Nov 27 , 2024 | 06:34 AM

దేశ పౌరుల ప్రాథమిక హక్కులను రాజ్యాంగం పరిరక్షిస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ అన్నారు.

హైకోర్టులో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

  • ముఖ్య అతిథిగా జస్టిస్‌ రామకృష్ణ ప్రసాద్‌ హాజరు

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): దేశ పౌరుల ప్రాథమిక హక్కులను రాజ్యాంగం పరిరక్షిస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సమరయోధుల త్యాగాలను మర్చిపోకూడదన్నారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్‌.శ్రీహరి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వై.లక్ష్మణరావు భారత రాజ్యాంగ పీఠికను చదివి రిజిస్ట్రార్‌లు, హైకోర్టు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అలాగే రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో సభ్యకార్యదర్శి ఎమ్‌.బబిత పీఠికను చదివి సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - Nov 27 , 2024 | 06:34 AM