CPI : జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖలో సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశాలు
ABN , Publish Date - Jun 16 , 2024 | 04:36 AM
సీపీఐ రాష్ట్ర సమితి, కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు.
అమరావతి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : సీపీఐ రాష్ట్ర సమితి, కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుందని, 2, 3 తేదీల్లో రాష్ట్ర సమితి సమావేశాలు కొనసాగుతాయని వివరించారు. తమ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.