Share News

ప్రభుత్వ నియంత్రణ లేని చట్టాలెందుకు?

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:28 AM

మండలి సమావేశాల తీరును విమర్శిస్తూ పీడీఎఫ్‌, ఎమ్మెల్సీలు మంగళవారం మీడియా పాయింట్‌లో మాట్లాడారు.

ప్రభుత్వ నియంత్రణ లేని చట్టాలెందుకు?

  • వర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి: పీడీఎఫ్‌

అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలి సమావేశాల తీరును విమర్శిస్తూ పీడీఎఫ్‌, ఎమ్మెల్సీలు మంగళవారం మీడియా పాయింట్‌లో మాట్లాడారు. గత, ప్రస్తుత శాసనమండలి సమావేశాల్లో పీడీఎఫ్‌ పక్షాన అడిగిన ఏ ప్రశ్నపైనా ప్రభుత్వాలు చర్చించడం లేదని ఆ కూటమి ఎమ్మెల్సీ ఇళ్లా వెంకటేశ్వరరావు ఆక్షేపించారు. ఈ విషయంపై మండలి చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ‘విశాఖ డెయిరీ పాల సేకరణ ధర తగ్గిస్తే... మ్యాక్స్‌ చట్టం వల్ల డెయిరీపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని మంత్రి చెప్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేని చట్టాలను ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలి. గత ప్రభుత్వం ఆర్టీసీ విలీనం పేరుతో డ్రైవర్లు, కండక్టర్ల టీఏ, డీఏ వంటి అలవెన్సులను రద్దు చేసింది. తిరిగి వాటిని అమలు చేయాలి’ అని కోరారు.

  • వీసీలను నియమించండి: లక్ష్మణరావు

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 5,000 అధ్యాపక పోస్టులను భర్తీచేయాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. 15 విశ్వవిద్యాలయాల్లో పూర్తికాలపు ఉపకులపతులు లేరని, వెంటనే వారి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఉన్నత విద్యా మండలికి రెగ్యులర్‌ చైర్మన్‌ని నియమించాలని సూచించారు.

Updated Date - Nov 20 , 2024 | 05:29 AM