Share News

Dharna demanding justice : న్యాయం కోరుతూ ధర్నా

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:16 PM

దివ్యాంగుడు బచ్చు సురేశ్‌బాబుకు తీర ని అన్యాయం చేసిన కొండపేట వాసి మంజుల, ఆమె భర్త శివరామిరెడ్డి అన్న విజయభాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని వికలాంగుల హక్కుల పోరా ట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నం సుబ్బయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Dharna demanding justice : న్యాయం కోరుతూ ధర్నా
పోలీసుస్టేషన్‌ వద్ద ధర్నా చేస్తున్న వీహెచ్‌పీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ నేతలు

ముగ్గురిపై కేసులు నమోదు చేయాలి

వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్‌

చెన్నూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుడు బచ్చు సురేశ్‌బాబుకు తీర ని అన్యాయం చేసిన కొండపేట వాసి మంజుల, ఆమె భర్త శివరామిరెడ్డి అన్న విజయభాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని వికలాంగుల హక్కుల పోరా ట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అన్నం సుబ్బయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. చెన్నూరు పోలీసుస్టేషన్‌ ఎదుట బుధ వారం ఎమ్మార్పీఎస్‌తో కలిసి ధర్నా చే పట్టిన వీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ సురేశ్‌బాబు ప్రస్తుతం మైదుకూ రు మండలం గుడ్డివీరయ్య సత్రం వద్ద జీవిస్తు న్నారన్నారు. ఇతని ఇంటిని కొండపేట గ్రామం లో మంజుల కుటుంబానికి నాలుగున్నర లక్షల కు అమ్మి రిజిస్ట్రేషన్‌ చేయించారన్నారు. అయితే ఇంటి సమస్య కోర్టులో ఉందని ముందే తెలప డంతో కోర్టు సమస్య తీరగానే మిగిలిన లక్ష రూపాయలు ఇస్తామని మంజుల కుటుంబం చెప్పారన్నారు. కొద్దిరోజుల తరువాత మంజుల కుటుంబం సురేశ్‌బాబును పిలిచి మీ ఇల్లు తిరిగి మీకు ఇచ్చేస్తాం, మేం ఇచ్చిన సొమ్ము వెనక్కు ఇవ్వమని నమ్మబలికి కడప రిజిస్టరు కార్యాలయం వద్ద సురేశ్‌బాబు నుంచి మంజుల కుటుంబం నాలుగున్నర లక్షలు డబ్బు తీసుకు న్నారన్నారు.


డబ్బు తీసుకున్న మంజుల కుటుం బం సురేశ్‌బాబుకు ఇంటిని తిరిగి రిజిస్టరు చేసి ఇవ్వకుండా వెళ్లారు. ఈ విషయమై పలుమార్లు ఇల్లు ఇవ్వమని కోరినా ఇవ్వకపోగా ఇటీవల ఇం టి వద్దకు వెళ్లిన సురేశ్‌బాబును ఇబ్బంది పెట్ట డం అసభ్యపదజాలంతో దూషించారని తెలి పా రు. దీంతో దివ్యాంగునికి జరిగిన అన్యాయం పై ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. పైగా సురేశ్‌ బాబుకు ఇల్లు తిరిగి ఇవ్వడం, అత న్ని ఇబ్బంది పెట్టి దూషించిన వారి పై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వారి డిమాండ్లపై సీఐకి వినతిపత్రం ఇచ్చారు. దీంతో సీఐ మాట్లాడుతూ ప్రస్తుతం సురేశ్‌ బాబు చెప్పిన మేరకు మంజులపై కేసు నమోదు చేశా మని, మిగిలిన ఆమె భర్త సోదరుడు విజయ భాస్కర రెడ్డిపై కూడా విచారణ చేయిస్తామన్నారు. శనివారం రావా లని వీహెచ్‌పీఎస్‌ సభ్యులకు, దివ్యాంగునికి చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి సుబ్బా రావు, జిల్లా అధ్యక్షుడు మాతయ్య, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మానికింది వెంకటేశ్‌, ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు కేఎన్‌ రాజు, ఆంజనేయులు, నగర అధ్యక్షులు ప్రసాద్‌, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నరసింహులు, జిల్లా మహిళా ప్రఽధాన కార్యదర్శి లలిత, సుబ్బ రాయుడు, గురవయ్య, ఓబయ్య , ఎరుకలయ్య ఆరిఫుల్లా, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:16 PM