Home » Chennur
మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నానని, పాలకవర్గం లేకపోవడంతో ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
యువత చదు వుతోపాటు క్రీడల్లో రాణించాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ అం బేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న కాసిపేట మం డల ప్రీమియర్‌లీగ్ సీజన్ 3 పోటీలను ఆదివారం ప్రారం భించారు.
పాలకవర్గం లేని మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు అందుగుల శ్రీనివాస్, కొంగల తిరుపతిరెడ్డి, రాయబారపు వెంకన్నలు తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీకి ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రజలు నష్టపోతున్నారని, సంక్షేమం కుంటు పడుతుందన్నారు.
చెన్నూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. శనివారం రాత్రి మున్సిపల్ కార్యాల యంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
వేలాల గ్రామంలో గట్టు మల్లన్న గుట్టమీద సోమవారం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
మండల కేంద్రంలోని 138 సర్వే నెంబరులోని భూములను తమకు ఇప్పించాలని బాధితులు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. వారు మాట్లా డుతూ దొరలకు పాలేరుగా ఉండడంతో అందించిన భూమిని రెండేళ్ళ క్రితం వరకు సాగు చేసుకుని జీవిస్తుండగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభి వృద్ధి పేరిట తమ భూములను బలవంతంగా లాక్కుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని, నియోజకవర్గంలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంగళవారం మల్లంపేటలో పలు గ్రామాలకు సంబంధించి రూ. 1.10 కోట్ల నిధులతో 10 సీసీ రోడ్లు, 12 డ్రైనేజీ నిర్మాణ పనులు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
చెన్నూరు నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి అన్నారు. శనివారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో వసతి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
మండలంలోని సర్వాయిపేట గ్రామా నికి చెందిన గుగ్లోత్ రుచిత జనవరి 26న ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వ హించే రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు ఎంపికైంది. కోటపల్లి మోడల్ స్కూల్, కళాశాలలో ఇంటర్ వరకు చదువుకున్న రుచిత ప్రస్తుతం శాతావాహన విశ్వ విద్యాలయం పరిధిలోని కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది.
మండలంలోని కిష్టంపేట గ్రామంలోని వరలక్ష్మీ జిన్నింగు మిల్లు ఎదుట పత్తికి మద్దతు ధర చెల్లించాలని రైతులు శుక్రవారం చెన్నూరు-మం చిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహిం చారు.