పొ పోరా శ్రీమంతుడా
ABN , Publish Date - Apr 29 , 2024 | 04:44 AM
గ్రామాల్లో జన్మించి ఉద్యోగాలు, వ్యాపారాలపరంగా విదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలకు జన్మభూమికి సేవచేసే అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం కాలరాచింది. స్మార్టు వార్డు-స్మార్డు విలేజ్ పథకాన్ని అధికారంలోకి రాగానే సీఎం జగన్ రద్దు చేశారు.
దత్తత వద్దు... పల్లెలు బాగు చేయొద్దు...
ఎన్‌ఆర్‌ఐలకు జగన్ మార్క్ బెదిరింపులు
ఎన్‌ఆర్‌ఐలకు ‘జన్మభూమి’పై ఉండే సెంటిమెంటును గ్రామ అభ్యుదయానికి పెట్టుబడిగా మలచడంలో చంద్రబాబు, ఆయన తెచ్చిన ‘స్మార్టు వార్డు-స్మార్టు విలేజ్’ పథకం సఫలీకృతమయ్యాయి. దీని స్థానంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన ‘కనెక్ట్ ఆంధ్రా’ కాన్సె్‌ప్ట ఎన్‌ఆర్‌ఐల పట్ల ద్వేషాన్ని ప్రదర్శించింది. ఎన్‌ఆర్‌ఐలను బూచీల్లా, ఒక ‘సామాజిక వర్గం’ మనుషులుగా దుష్ప్రచారం చేసింది. ఎన్‌ఆర్‌ఐల వల్ల కలుగుతున్న రూ.కోట్ల మేలును కాలదన్నేలా ప్రవర్తించింది. వారిని రాష్ట్రం వదిలిపెట్టి పోయేలా వేఽధింపులకు గురిచేసింది. ఈవిధంగా ‘కనెక్ట్ ఆంధ్రా’ కాన్సె్‌ప్టను సర్కారే చంపేసింది.
బూచీల్లా చిత్రీకరిస్తూ వారిపై విషపు ప్రచారం
సాయానికి వస్తే ‘సామాజిక వర్గం’ ముద్ర
జగన్ నిర్వాకంతో దత్తతకు గ్రామాలు దూరం
టీడీపీ హయాంలో సొంత ఊరికి సేవచేసే వీలు
స్మార్ట్ వార్డు- స్మార్టు విలేజ్ పేరిట కార్యక్రమాలు
ఎన్‌ఆర్‌ఐల నిధులకు కొంత తనవీ కలిపి పనులు
ఆ స్ఫూర్తిని ఘోరంగా దెబ్బతీసిన జగన్
‘నిధులు మీవి..నిర్ణయాలు మావి’ అన్నట్టు తీరు
సర్కారుపై విశ్వాసం కోల్పోయిన ఎన్‌ఆర్‌ఐలు
గ్రామాల్లో జన్మించి ఉద్యోగాలు, వ్యాపారాలపరంగా విదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలకు జన్మభూమికి సేవచేసే అవకాశాన్ని వైసీపీ ప్రభుత్వం కాలరాచింది. స్మార్టు వార్డు-స్మార్డు విలేజ్ పథకాన్ని అధికారంలోకి రాగానే సీఎం జగన్ రద్దు చేశారు. దాని స్థానంలో తెచ్చిన ‘కనెక్ట్ ఆంధ్రా’ కాన్సె్‌ప్ట...ఎవరికీ కనెక్ట్ కాలేదు. తమ డబ్బును తమ చేతులతో ఖర్చుపెట్టాలని ఏ దాత అయినా అనుకుంటారు. వారి సెంటిమెంటును టీడీపీ ప్రభుత్వం గౌరవిస్తూ... ‘కొంత మీరు పెట్టండి.. కొంత మేం సమకూరుస్తాం’ అన్న పద్ధతిలో కార్యక్రమాలు చేసింది. కానీ, జగన్ తెచ్చిన ‘కనెక్ట్ ఆంధ్రా’ దీనికి రివర్స్. ‘డబ్బులు మీరివ్వండి...గ్రామానికి ఏంచేయాలో మేంచేస్తాం’ అన్నట్టు ప్రభుత్వ వైఖరి ఉండటంతో, ఎన్‌ఆర్‌ఐలు, దాతలు ముఖం చాటేశారు. మేమిచ్చిన నిధులు గ్రామాలకు ఖర్చు పెడతారని నమ్మకమేమిటి అని శ్రీమంతులు ప్రశ్నించారు.
ప్రముఖులెందరో నాడు కదిలొచ్చె..
టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు విశాఖ జిల్లా అరకులోయను, ఆయన సతీమణి భువనేశ్వరి కృష్ణా జిల్లా కొమరవోలును, కుమారుడు నారా లోకేశ్ తాత ఎన్టీఆర్ గ్రామం నిమ్మకూరును, కోడలు బ్రహ్మణి చిత్తూరు జిల్లా నారావారిపల్లెను దత్తత తీసుకున్నారు. మంత్రి నారాయణ తాను జన్మించిన నెల్లూరు జిల్లా తోటపల్లిగూడురును, తాను పెరిగిన నెల్లూరు నగరంలోని హరనాథపురాన్ని(18వ వార్డును) దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ అనంతపురంలోని ముత్తంకుంట్ల గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు పరిటాల రవీంద్ర 10వ వర్ధంతి రోజున ప్రకటించారు. ప్రిన్స్ మహేశ్‌బాబు తన తండ్రి గ్రామమైన గుంటూరు జిల్లా బుర్రిపాలేన్ని దత్తత తీసుకున్నారు. కృష్ణ కుమార్తె, ఎంపీ గల్లా జయదేవ్ సతీమణి పద్మావతి కంచర్ల గ్రామాన్ని తీసుకున్నారు. డీజీపీ రాముడు తన స్వగ్రామం అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని నరసింహపల్లిని దత్తత తీసుకున్నారు.
పుణ్యానికి వస్తే పాపం అంటగట్టి..
దత్తత స్ఫూర్తిని సమాధి చేసిన అధికారపక్ష నేతలు, మరో అడుగు ముందుకేశారు. రాష్ట్రానికొస్తున్న ఎన్‌ఆర్‌ఐలను సోషల్‌మీడియా వేదికగా వేధిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రానికి వారి సేవలందకుండా అడ్డుకుంటున్నారు. ఇటీవల ఎన్‌ఆర్‌ఐలు బాహాటంగానే ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ప్రకటనలు చేశారు.
20 అంశాల కార్యక్రమం..
ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాశాఖ....యునిసె్‌ఫతో కలిసి స్మార్టు గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి గ్రామాలను దత్తత తీసుకునే వారికి అందించింది. దత్తత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, మాతాశిశు సంరక్షణ, పిల్లల చదువు, పర్యావరణ పరిరక్షణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన తదితర 20 అంశాలతో ముందుకెళ్లింది. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు,, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్వచ్ఛంద సంస్థలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, ఇతర కళాకారులు తమకు నచ్చిన గ్రామాన్ని దత్తత చేసుకుని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనేది ప్రభుత్వ ఆకాంక్ష. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామాన్ని లేదా వార్డును దత్తత తీసుకుంటే స్మార్ట్ ఏపీని సాధించవచ్చనేది ప్రభుత్వ అభిప్రాయం.
సంస్థలు, వ్యక్తులు దత్తత తీసుకోగా మిగిలిన ఊళ్లను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎ్‌ఫఎస్, రాష్ట్ర ఉన్నతోద్యోగులు దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. దత్తత తీసుకున్న వారు ఆ గ్రామానికి వెళ్లి అక్కడ సామాజికాభివృద్ధి, హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, పర్యావరణం తదితర అంశాలను పరిశీలించి పురోగమనానికి దోహదం కలిగించారు.
ఆయా గ్రామాలకు వచ్చే వనరులను సమీకరించి ఎలా ఖర్చు పెడితే అవి అభివృద్ధి చెందుతాయో దత్తత తీసుకున్న వారు, గ్రామాధికారులు కలిసి నిర్ణయించారు. జన్మభూమి కార్యక్రమంలో సేకరించిన సమాచారాన్ని పోర్టల్‌లో అందుబాటులో ఉంచి, దేశవిదేశాల్లో ఉన్న గ్రామీణులు ఆన్‌లైన్ ద్వారా గ్రామాన్ని, వార్డును ఎంపిక చేసుకునేలా ఏర్పాట్లుచేశారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించారు.
దత్తత కోసం గ్రామ పంచాయతీ/వార్డులు లేదా వివిధ రంగాల జాబితాను రూపొందుతున్న పబ్లిక్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. పలువురు ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రభుత్వ సహకారంతో, తమ సొంత నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించేందుకు పలు స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేపట్టింది. సంక్రాంతికి గ్రామాలకు వచ్చిన ఎన్‌ఆర్‌ఐలను పురస్కారాలతో సన్మానాలు చేసింది. స్మార్టు విలేజ్ కార్యక్రమంలో ఎవరెవరు ఏమి చేయాలనే విషయంపై మార్గదర్శకాలను కూడా ఏపీ ప్రణాళికాశాఖ, యూనిసెఫ్ సంయుక్తంగా అప్పట్లో రూపొందించి అమలు
20 అంశాల కార్యక్రమం..
ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాశాఖ....యునిసె్‌ఫతో కలిసి స్మార్టు గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి గ్రామాలను దత్తత తీసుకునే వారికి అందించింది. దత్తత గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, మాతాశిశు సంరక్షణ, పిల్లల చదువు, పర్యావరణ పరిరక్షణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన తదితర 20 అంశాలతో ముందుకెళ్లింది. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు,, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్వచ్ఛంద సంస్థలు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, ఇతర కళాకారులు తమకు నచ్చిన గ్రామాన్ని దత్తత చేసుకుని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనేది ప్రభుత్వ ఆకాంక్ష. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామాన్ని లేదా వార్డును దత్తత తీసుకుంటే స్మార్ట్ ఏపీని సాధించవచ్చనేది ప్రభుత్వ అభిప్రాయం.
సంస్థలు, వ్యక్తులు దత్తత తీసుకోగా మిగిలిన ఊళ్లను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎ్‌ఫఎస్, రాష్ట్ర ఉన్నతోద్యోగులు దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. దత్తత తీసుకున్న వారు ఆ గ్రామానికి వెళ్లి అక్కడ సామాజికాభివృద్ధి, హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత, పర్యావరణం తదితర అంశాలను పరిశీలించి పురోగమనానికి దోహదం కలిగించారు.
ఆయా గ్రామాలకు వచ్చే వనరులను సమీకరించి ఎలా ఖర్చు పెడితే అవి అభివృద్ధి చెందుతాయో దత్తత తీసుకున్న వారు, గ్రామాధికారులు కలిసి నిర్ణయించారు. జన్మభూమి కార్యక్రమంలో సేకరించిన సమాచారాన్ని పోర్టల్‌లో అందుబాటులో ఉంచి, దేశవిదేశాల్లో ఉన్న గ్రామీణులు ఆన్‌లైన్ ద్వారా గ్రామాన్ని, వార్డును ఎంపిక చేసుకునేలా ఏర్పాట్లుచేశారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందించారు.
దత్తత కోసం గ్రామ పంచాయతీ/వార్డులు లేదా వివిధ రంగాల జాబితాను రూపొందుతున్న పబ్లిక్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. పలువురు ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రభుత్వ సహకారంతో, తమ సొంత నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ప్రభుత్వం కూడా వారిని ప్రోత్సహించేందుకు పలు స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేపట్టింది. సంక్రాంతికి గ్రామాలకు వచ్చిన ఎన్‌ఆర్‌ఐలను పురస్కారాలతో సన్మానాలు చేసింది. స్మార్టు విలేజ్ కార్యక్రమంలో ఎవరెవరు ఏమి చేయాలనే విషయంపై మార్గదర్శకాలను కూడా ఏపీ ప్రణాళికాశాఖ, యూనిసెఫ్ సంయుక్తంగా అప్పట్లో రూపొందించి అమలు చేశాయి.