Share News

Dr. Jayaprakash Narayan : విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు

ABN , Publish Date - Dec 30 , 2024 | 05:14 AM

‘విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అప్పుడే సమాజంలో ప్రతిభ వికసిస్తుంది’’ అని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ అన్నారు.

 Dr. Jayaprakash Narayan : విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు

క్రియ పిల్లల పండుగలో డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ

సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి) : ‘‘విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అప్పుడే సమాజంలో ప్రతిభ వికసిస్తుంది’’ అని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ఆదివారం కాకినాడ జేఎన్‌టీయూలో నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీల క్రియ పిల్లల పండుగ ముగింపు వేడుకలో ఆయన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 11 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రియ సంస్థ కార్యదర్శి ఎస్‌ఎ్‌సఆర్‌ జగన్నాథరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 05:15 AM