Home » JD Lakshmi Narayana
‘విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అప్పుడే సమాజంలో ప్రతిభ వికసిస్తుంది’’ అని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు, రిటైర్డు ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు.
Satya Kumar Yadav: తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.ఆంగ్లం మాట్లాడితే తాము చాలా గొప్ప అనే భావన చాలా మందిలో ఉందని.. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాజులెందరో ఉన్నారని గుర్తుచేశారు. రాజకీయంగా నేతల మధ్య సైద్ధాంతిక విబేధాలు ఉన్నా.. భాష కోసం అందరూ కలిసి నడవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 సందర్భంగా భారతదేశపు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ విశాఖపట్నంలోని కైలాసగిరి కొండ మరియు రుషికొండ బీచ్ వద్ద ‘ఓపెన్ ఫర్ ది ప్లానెట్ క్లీనథాన్’ పేరిట పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించింది.
విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కొంతమంది తనపై దాడికి ప్లాన్ చేశారని జై భారత్ నేషనల్ పార్టీ (Jai Bharat National Party) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) సంచలన ఆరోపణలు చేశారు. తాను సీబీఐ జేడీగా ఉన్నప్పుడు ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడంతో కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు.ఆ వ్యక్తి అభిమానులు ఇప్పుడు తనపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు.
విశాఖపట్నం నార్త్ నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు.
అన్ని పార్టీలు డబ్బులున్న వారికి, ఎన్ఆర్ఐలకు, రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి టికెట్లు ఇస్తున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(Laxminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... డబ్బులు పెట్టలేని తనలాంటి వారు ఎంతోమంది ఉన్నారని.. అలాంటి వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.
ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ఏకపక్షంగా ఉందని ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) అన్నారు. తిరుపతి లోక్‌సభ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఏపీ యునైటైడ్ ఫ్రంట్ వ్యవస్థాపకులు విజయ్ కుమార్(IAS) పోటీ చేస్తారని సోమవారం నాడు ప్రకటించారు.
విభజన హామీలను సాధించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వంచి సాధిస్తామని జగన్ అన్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం జై భారత్ నేషనల్ పార్టీ పోరుబాట పట్టింది. ఏపీకి హోదా కోసం అఖిలపక్షం వేయాలని, ఢిల్లీ తీసుకెళ్లాలని సీఎం జగన్‌కు డిమాండ్ చేసింది. సీఎం జగన్ ఇంటిని ముట్టడించేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ప్రయత్నించారు.