Share News

జనసేనలో 150 కుటుంబాలు చేరిక

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:58 AM

ఎటపాక, ఫిబ్రవరి12 : ఎటపాక మండలం కన్నాయిగూడెంలోని శ్రీరామ్‌ నగర్‌కాలనీలో సుమారు 150 కుటుంబాలు సోమవారం జనసేన పార్టీలో చేరాయి. ఆ పార్టీ మండలాధ్యక్షుడు మారాసు గంగాధర్‌ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారాసు గంగాధర్‌ మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు వారంతా తెలిపారు. ఈ కార్యక్ర

జనసేనలో 150 కుటుంబాలు చేరిక

ఎటపాక, ఫిబ్రవరి12 : ఎటపాక మండలం కన్నాయిగూడెంలోని శ్రీరామ్‌ నగర్‌కాలనీలో సుమారు 150 కుటుంబాలు సోమవారం జనసేన పార్టీలో చేరాయి. ఆ పార్టీ మండలాధ్యక్షుడు మారాసు గంగాధర్‌ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారాసు గంగాధర్‌ మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు వారంతా తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం జనసేన మండల అధ్యక్షుడు పి, శ్రీనివాసరావు, జనసేన సీనియర్‌ నాయకులు పయ్యవుల నాగేశ్వరరావు, టీడీపీ, జనసేన నాయకులు బం డారి భద్రరావు, కొమ్ము మహేష్‌, కొమ్ము వినయ్‌, సూరిశెట్టి సురేష్‌, డేగల మరళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:58 AM