Share News

‘31వేల క్వింటాళ్ల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు..’

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:03 AM

సామర్లకోట, నవంబరు 16 (ఆంధ్రజ్యో తి): కాకినాడ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజ న్లో శనివారం నాటికి 363 మంది రైతుల నుంచి 31 వేల 182 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సివిల్‌ సప్లయ్‌ జిల్లా మేనేజరు ఎం.ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘రైతు కష్టం దళారుల పాలు’ అనే పేరిట ఆంధ్రజ్యోతిలో కఽథ

‘31వేల క్వింటాళ్ల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు..’

సామర్లకోట, నవంబరు 16 (ఆంధ్రజ్యో తి): కాకినాడ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజ న్లో శనివారం నాటికి 363 మంది రైతుల నుంచి 31 వేల 182 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సివిల్‌ సప్లయ్‌ జిల్లా మేనేజరు ఎం.ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ‘రైతు కష్టం దళారుల పాలు’ అనే పేరిట ఆంధ్రజ్యోతిలో కఽథనం వచ్చిన విషయం తెలిసిందే. ఈ కఽథనంపై సివిల్‌ సప్లయ్‌ అధికారులు స్పందించారు. కాగా ఈ సీజన్లో గత నెల 22వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా 277 రైతుసేవా కేంద్రాల ద్వారా 363 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించి ఇప్పటికి కేవలం 3,118 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్ర మే కొనుగోలు చేయడం గమనార్హం. ఈ సీజన్లో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని ఎప్పటికి చేరుతారో, తమ నుంచి జోరుగా ధాన్యాన్ని ఎప్పటికి కొనుగోలు చేస్తారోనని క్షేత్రస్థా యిలో రైతులు ఎదురుతెన్నులు చూడడ మే కాకుండా వాతావరణ పరిస్థితుల నుం చి ధాన్యాన్ని కాపాడుకునేందుకు వ్యయ ప్రయాసలకు రైతులు లోనవుతున్నారు. పంటకోతలు ప్రారంభించిన 15 రోజుల వరకూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించక పోవడంతో రైతులు తమ వద్ద ధాన్యాన్ని భద్రపరుచుకోలేక అయినకాడికి ధాన్యాన్ని దళారీలకు అమ్ముకున్న విషయం వాస్తమే అయినప్పటికీ దళారీలు లేరు అంటూ సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఒక ప్రకటన విడుదల చేసి చేతులుదులుపుకోవడ మేనని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 01:03 AM