Share News

వరద బాధితులకు ‘ప్రగతి’ రూ.7 లక్షల విరాళం

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:57 AM

కాకినాడ రూరల్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): సెప్టెంబరులో రాష్ట్రంలో సంభవించిన తుఫాను వల్ల నిరాశ్రయులైన వారి సహాయార్ధం ప్రగతి విద్యాసంస్థల యాజమాన్యం, విద్యార్ధులు, సిబ్బంది తమవంతు సహాయంగా రూ.7 లక్షల విరాళమిచ్చారు. దీనిని ఏపీ సీఎం సహాయనిధికి చెక్కురూపంలో సోమవారం పిఠాపురం నియోజకవర్గం పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు కాకినాడ రూరల్‌ మండలం పి.వెంకటాపురం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం

వరద బాధితులకు ‘ప్రగతి’  రూ.7 లక్షల విరాళం
రూ.7 లక్షల చెక్కును పవన్‌ కళ్యాణ్‌కు అందజేస్తున్న పూర్ణచంద్రరావు

కాకినాడ రూరల్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): సెప్టెంబరులో రాష్ట్రంలో సంభవించిన తుఫాను వల్ల నిరాశ్రయులైన వారి సహాయార్ధం ప్రగతి విద్యాసంస్థల యాజమాన్యం, విద్యార్ధులు, సిబ్బంది తమవంతు సహాయంగా రూ.7 లక్షల విరాళమిచ్చారు. దీనిని ఏపీ సీఎం సహాయనిధికి చెక్కురూపంలో సోమవారం పిఠాపురం నియోజకవర్గం పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు కాకినాడ రూరల్‌ మండలం పి.వెంకటాపురం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో ప్రగతి విద్యాసంస్థల చైర్మన్‌ ఎన్‌.పూర్ణచంద్రరావు అందజేసారు. మానవతా దృక్పధం తో స్పందించి వరద బాధితుల సహాయార్ధం విరాళాన్నిచ్చిన ప్రగతి యాజమాన్యాన్ని, సిబ్బ ందిని, విద్యార్థులను పవన్‌ అభినందించారు.

అదే విధంగా సుభానికేతన్‌ విద్యార్థులు, సిబ్బంది కలిపి వరదబాధితుల సహాయార్ధం సీఎం సహాయనిధికి రూ.2లక్షల విరాళాన్ని చెక్కురూపంలో కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో ప్రిన్సిపాల్‌ రమాదేవి డిప్యూటీ సీఎం పవన్‌కు అందజేశారు.

Updated Date - Nov 05 , 2024 | 12:57 AM