Share News

బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాదాలను నివారించాలి

ABN , Publish Date - Oct 30 , 2024 | 12:21 AM

జిల్లాలో రహదారి ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాలపై అనుబంధ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నివారణా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్‌ స్పాట్‌ జంక్షన్లను గుర్తించి ఇంజనీర్ల సహకారంతో నివారణా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

 బ్లాక్‌ స్పాట్లను గుర్తించి ప్రమాదాలను నివారించాలి

అమలాపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారి ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాలపై అనుబంధ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నివారణా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్‌ స్పాట్‌ జంక్షన్లను గుర్తించి ఇంజనీర్ల సహకారంతో నివారణా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. గత సమావేశంలో తీర్మానించిన అంశాలపై కమిటీ సభ్యులు తీసుకున్న చర్యలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఇంటిగ్రేటెడ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ సెంట్రల్‌ పోర్టల్‌లో గత మూడు నెలలుగా నమోదైన ప్రమాదాల సంఖ్య తీవ్రతలను, సంబంధిత అధికారులు తీసుకున్న నివారణా చర్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు మార్జిన్లను బలోపేతం చేయడంతో పాటు మలుపుల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నివారణా చర్యలు చేపట్టాలన్నారు. హై మాస్క్‌ లైటింగ్‌ ఏర్పాటు, స్పీడ్‌ బ్రేకర్లు, రేడియం స్టిక్కర్ల వంటి ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట్ల వైద్య ఆరోగ్యశాఖ ట్రామా కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల్లో రహదారి భద్రతా క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్‌ స్పాట్‌ల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రహదారుల అథారిటీ ఆఫ్‌ ఇండియా టెక్నికల్‌ మేనేజర్‌ అమిత్‌ అన్సారీ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.రాము, డీసీహెచ్‌ఎస్‌ కార్తీక్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.దుర్గారావుదొర, జాతీయ రహదారులశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 12:21 AM