Home » KonaSeema
పూర్వపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పీపీపీ విధానంలో రోడ్లు అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. కార్లపై ప్రయాణించే వారి నుంచి మాత్రమే టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వాహనాలకు టోల్ ఫీజు ఉండదని స్పష్టం చేశారు. అమలాపురం అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీకి సంబంధించిన ప్రతిపాదనలు క్రోడీకరించి సమర్పిస్తే వాటి మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేసును విజయవంతంగా ఛేదించిన జిల్లాకు చెందిన పోలీసు అధికారులకు ఏపీ రాష్ట్ర పోలీసు ఏబీసీడీ అవార్డులను రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు అందజేశారు. అమలాపురం తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలోని క్రైమ్ నంబరు 181/2024లో నిందితులుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేసును ఇటీవల జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక బృందం అరెస్టు చేసింది.
ప్రకృతి అందాలతో పరవశింపజేసే కోనసీమ జిల్లా అన్ని రంగాల్లోను సర్వతోముఖాభివృద్ధి సాధించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల గోదావరి భవన్లో బుధవారం సాయంత్రం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించారు.
రావులపాలెం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లి చేసుకున్న తరుణంలో అత్తింటివారు కాపురానికి రానివ్వకుండా వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత భర్త ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. యు వతి, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం కొమరాజులంకకు చెందిన గండ్రోతు హరికృష్ణ, యామన ఝాన్సీ 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
రాష్ట్రంలో షెడ్యూల్డు కులాల ఉప వర్గీకరణ అంశాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు ఏకసభ్య కమిషన్ నియమించినట్టు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారిణి పి.జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని 15 డిస్ర్టిబ్యూటరీ కమిటీలకు మంగళవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. డిస్ర్టిబ్యూటరీ కమిటీ పరిధిలోకి వచ్చే సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు తొలుత డిస్ర్టిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత కమిటీ వైస్ చైర్మన్‌ను కూడా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఎన్నికల అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
కృష్ణాగోదావరి బెసిన్ పరిధిలో సుమారు 30 ఏళ్లుగా చమురు ఉత్పత్తులు తరలిస్తున్న ఓఎన్జీసీ ఓడలరేవులో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రమోటక్ మెయింటెన్స్ కంపెనీలు ఇతరులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
భవిష్యత్ తరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్‌ను ఆదా చేయడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని ఆమె చెప్పారు. కలెక్టరేట్ నుంచి అమలాపురం గడియార స్తంభం సెంటర్ వరకు శనివారం నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు.
జిల్లాలో 83 సాగునీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటయ్యాయని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ శనివారం తెలిపారు. జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో పూర్తి అయ్యాయన్నారు.
అమలాపురం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా దొంగనోట్లు భారీగా ముద్రిస్తూ చెలామణి చేస్తున్న పన్నెండు మంది సభ్యుల దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు శుక్రవారం సాయంత్రం అమలాపు రంలో ఏర్పాటుచేసిన విలే