Share News

దాళ్వాలో వరిసాగుకు యాక్షన్‌ ప్లాన్‌

ABN , Publish Date - Nov 08 , 2024 | 12:05 AM

జిల్లాలో దాళ్వా సాగుకు సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకుడు బోసుబాబు తెలిపారు. మండపేట మండలం ద్వారపూడి వచ్చిన ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. రామచంద్రపురం, మండపేట ఆలమూరు, రాయవరం, కపిలేశ్వరపురం, కె.గంగవరం మండలాల్లో కోతలు ప్రారంభమయ్యాయన్నారు.

దాళ్వాలో వరిసాగుకు యాక్షన్‌ ప్లాన్‌

మండపేట, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో దాళ్వా సాగుకు సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకుడు బోసుబాబు తెలిపారు. మండపేట మండలం ద్వారపూడి వచ్చిన ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. రామచంద్రపురం, మండపేట ఆలమూరు, రాయవరం, కపిలేశ్వరపురం, కె.గంగవరం మండలాల్లో కోతలు ప్రారంభమయ్యాయన్నారు. ఈ నెల 15 నుంచి జిల్లా అంతటా కోనసీమలో కోతలు ముమ్మరంగా జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. జిల్లాలో 1.53 లక్షలు ఎకరాల్లో వరిసాగు చేశారు. ఎకరాకు దిగుబడి 30 నుంచి 35 బస్తాల వరకు వస్తుంది. ఇప్పటికే 25 శాతం మేర కోతలు పూర్తయ్యాయి. మిగిలినవి నవంబరు నెలాఖరు.. డిసెంబరు తొలివారంలో పూర్తవుతాయి. దాళ్వాలో జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే రైతులకు అవసరమైన ఎరువులను సిద్ధం చేశామని బోసుబాబు తెలిపారు. దాళ్వాలో 1.72 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తుండగా అందులో 90 శాతం వెదజల్లే ్లవిధానం ద్వారానే నాట్లు జరిగిపోతాయన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 12:05 AM