Share News

అమిత్‌షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి

ABN , Publish Date - Dec 23 , 2024 | 01:22 AM

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మాలమహానాడు నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు

అమిత్‌షాను మంత్రి  పదవి నుంచి తొలగించాలి

అమలాపురం టౌన్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మాలమహానాడు నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. తొలుత అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పీవీ రావు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి మాల మహానాడు నాయకులు పెయ్యల శ్రీనివాసరావు, పెయ్యల పరశురాముడు, జల్లి శ్రీనివాసరావు, నాతి శ్రీనివాసరావు, గన్నవరపు శ్రీను తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్ర పాలకుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అంబేడ్కర్‌పై ప్రధాని మోదీకి నిజంగా ప్రేమ ఉంటే తక్షణం అమిత్‌షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన ర్యాలీలో నాయకులు మట్టా వెంకటరావు, పెనుమాల చిట్టిబాబు, పోతుల నాగరాజు, కాశి వెంకట్రావు, పరమట రామ్‌ప్రసాద్‌, గోసంగి సంపదరావు, నందిక శ్రీను, నెల్లి ప్రసాద్‌, గెద్దాడ బుద్ధరాజ్‌, సరెళ్ల రామకృష్ణ, బొంతు శ్రీను, మెండి డేవిడ్‌అంబేడ్కర్‌, కాశి రాంబోధి, పోతుమూడి రవి, రొక్కాల నాగేశ్వరరావు, పరమట నానితో పాటు పీవీ రావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 01:22 AM