Share News

అక్షరం.. ఆయుధమై!

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:52 AM

అక్షరమే ఆయుధమైంది.. ప్రజల సమస్య లపై గళమెత్తింది.. అధికారులను పరుగులు పెట్టించింది..

అక్షరం.. ఆయుధమై!
ప్రకాశరావుపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న జేసీ చినరాముడు

అక్షరమే ఆయుధమైంది.. ప్రజల సమస్య లపై గళమెత్తింది.. అధికారులను పరుగులు పెట్టించింది.. సమస్యల పరిష్కారంలో ఆంధ్రజ్యోతి సత్తాచాటింది.. గోకవరం రెవెన్యూ కార్యాలయంలో అర్ధరాత్రి అవినీతి గబ్భిలాల జాడ చూపింది.. స్పం దించిన ఉన్నతాధికారులు విచారణలో దిగారు.. ఇక రైల్వే స్టేషన్‌లో చెత్త కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేయడంతో ఏకంగా కాంట్రాక్టు సంస్థ మారిపోయింది.. మరో వైపు నల్లజర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలేవీ అంటూ ప్రశ్నించడంతో జేసీ చిన్నరాముడు రంగంలోకి మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించారు.

గోకవరంలో దందాపై ఆర్డీవో విచారణ

గోకవరం,అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): గోకవరం మండలంలోని రెవెన్యూ శాఖలో అవినీతి గబ్బిలాలను పట్టుకునేందుకు ఉన్నతాధికారుల విచారణ కు దిగారు. అవినీతి గబ్బిలాలు శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతిలో వెలువడిన కథ నంపై జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి రంగంలోకి దిగారు.స్థానిక తహశీల్దార్‌తో ఫోన్‌లో మా ట్లాడి నివేదిక అందజేయాలని ఆదేశించా రు.మంగళవారం రాజమహేంద్రవరం ఆర్డీ వో ఆర్‌.కృష్ణానాయక్‌ రెవెన్యూ కార్యాల యానికి చేరుకుని విచారణ నిర్వహించారు. సుమారు 12 మంది వీఆర్వో లను, కార్యా లయ సిబ్బందిని ఒక్కొక్కరిని తహశీల్దార్‌ గదిలోకి పిలిచి ఒంటరిగా విచారణ చేసి నట్టు తెలిసింది. ఏ గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారు..ఎన్నేళ్లగా ఈ మండ లం లో కొనసాగుతున్నారు.. ఎవరిపై ఏమేమి ఆరోపణలు ఉన్నాయి తదితర వివరాలపై వీఆర్వోల నుంచి ఆర్డీవో ఆరా తీశారు.

రైల్వేస్టేషన్‌ పారిశుధ్య కాంట్రాక్టు రద్దు

రాజమహేంద్రవరం,అక్టోబరు 22 (ఆంధ్ర జ్యోతి): రైల్వేస్టేషన్‌ పారిశుధ్య కాంట్రాక్టును రద్దు చేస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రి రైల్వేస్టేషన్‌ అపారి శుధ్యంతో కంపుకొడుతుండడం, నెలల తరబడి వ్యర్థాలు టన్నుల్లో పేరుకుపోవడంపై ‘స్వచ్ఛత నహీ’ శీర్షికన ఈ నెల 9న ‘ఆంధ్రజ్యోతి’లో కథ నం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. డివిజ నల్‌ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. అప్పటికే ఆగస్టు 8,అక్టోబరు 7న ఇచ్చిన నోటీస్‌ లపై తగు చర్యలు తీసుకోకపో వడాన్ని తప్పు బట్టారు.గతేడాది 29న హైదరాబాద్‌కి చెందిన ఎస్‌ఆర్‌ ఎంటర్‌ ప్రైజస్‌తో చేసుకున్న పారి శుధ్య కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ సోమవారం(21న) సీనియర్‌ డివిజనల్‌ మేనే జర్‌ ఎం.కిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరా బాద్‌కి చెందిన ఫైవ్‌స్టార్‌ ఎంటర్‌ ప్రైజస్‌ సంస్థకు తాత్కాలికంగా పారిశుధ్య బాధ్యతలు అప్పగించినట్టు చెబుతున్నారు.

ప్రతి ధాన్యం గింజ కొంటాం : జేసీ

నల్లజర్ల,అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగొలు చేస్తామని జేసీ చినరాముడు అన్నారు.ఈ నెల 19వ తేదీన నల్లజర్లలో ధాన్యం కొనుగొలు కేంద్రాలేవి శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు.మంగళవారం నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పా టు చేసి మాట్లాడారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ఽధాన్యం విక్రయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో రాణి సుస్మిత,తహశీల్దార్‌ శాంతి ప్రియ,ఎంపీడీవో సింహాద్రిరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:52 AM