Share News

‘బలి’ పశువులు!

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:33 AM

అసలు అధికారులు ఉన్నా రో లేదో తెలియడం లేదు.. తమ చెంతనే మూగ జీవాలను బలి తీసుకుంటున్నా కనీసం ప్రశ్నించడం లేదు.. పట్టుకోవడంలేదు.. కంపుకొడుతున్నా ఏమిటా అది అని అటు వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు.. దీంతో మూగజీవాలను యథేచ్ఛగా బలి తీసుకుం టున్నారు.

‘బలి’ పశువులు!
చూడండి సార్‌ : పశువుల కొమ్ములు, కాళ్లు, ఎముకలతో నిండి ఉన్న పోలవరం కాల్వగట్టు

మండల పరిషత్‌ కార్యాలయాల చెంతనే ఉన్నా కన్నెత్తి చూడని అధికారులు

దేవరపల్లి, జనవరి 27 : అసలు అధికారులు ఉన్నా రో లేదో తెలియడం లేదు.. తమ చెంతనే మూగ జీవాలను బలి తీసుకుంటున్నా కనీసం ప్రశ్నించడం లేదు.. పట్టుకోవడంలేదు.. కంపుకొడుతున్నా ఏమిటా అది అని అటు వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదు.. దీంతో మూగజీవాలను యథేచ్ఛగా బలి తీసుకుం టున్నారు.దేవరపల్లి గ్రామం శివారు పోలవరం కుడి కాల్వ సమీపంలో మండల పరిషత్‌, తహశీల్దార్‌ కార్యాలయం, డిగ్రీ కళాశాల ఉన్నాయి. పోలవరం కాల్వ వద్ద చిట్టి అడవిగా ఏర్పడడంతో ఇక్కడ కొందరూ జంతువధ చేయడానికి స్థావరం ఏర్పాటు చేసుకు న్నారు.జిల్లాలో ఎక్కడెక్కడి నుంచో పశువులను తీసు కొచ్చి అర్ధరాత్రులు పశువధ చేసి వ్యర్థాలను, ఎములకను ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ పడేస్తున్నారు. దీంతో ఎముకల వ్యర్థాలు గుట్టలుగా ఏర్పడి వీటి నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో చుట్టు పక్కల కిలో మీటర్ల పొడవునా దుర్గంధం వ్యాపించి పల్లంట్ల, ఏలూ రు రహదారి గుండా వెళ్ళే ప్రజల ముక్కుపుటాలను తాకుతోంది. అయినా స్థానిక అధికారుల్లో మాత్రం కనీస కదలిక లేదు..దేవరపల్లి వాసులు మాత్రం నిత్యం దుర్వాసనతో ముక్కుతిప్పలు పడుతున్నారు. ఈ సమస్యపై ఎన్నో సార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఉండలేకపోతున్నాం..

దేవరపల్లి గ్రామంలో ఉండలేకపోతు న్నాం. పశువుల వ్యర్థాల దుర్గంధంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. పశువుల వ్యర్థాలను తొలగించి పశువధ చేయకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరాం.. ఎన్నోసార్లు పంచాయతీ, రెవిన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.

- డాక్టర్‌ కాశీవిశ్వనాధం, దేవరపల్లి

Updated Date - Jan 28 , 2024 | 12:34 AM