సూపర్..బడ్జెట్!
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:44 AM
పయ్యావుల పద్దు సంక్షేమ మం త్రం జపించింది.బడ్జెట్‌లో ఎన్నికల హామీల అమ లుకు పెద్దపీట వేస్తూ ముందుకు కదిలింది. మహిళలు, అన్నదాతల మేలే అసలు సిసలు ప్రాధాన్యంగా భావించి వరాల జల్లు కురిపిం చింది.
రాష్ట్ర బడ్జెట్‌లో వరాల జల్లు
సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి
సూపర్‌సిక్స్ హామీలకు పెద్దపీట
మళ్లీ ఎన్టీఆర్ జలసిరి
నగరాల అభివృద్ధి చర్యలు
‘తూర్పులో ప్రత్యేక బెటాలియన్
చింతలపూడికి ప్రాధాన్యం
రహదారులు మార్చికి రెడీ
కాకినాడ/రాజమహేంద్రవరం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పయ్యావుల పద్దు సంక్షేమ మం త్రం జపించింది.బడ్జెట్‌లో ఎన్నికల హామీల అమ లుకు పెద్దపీట వేస్తూ ముందుకు కదిలింది. మహిళలు, అన్నదాతల మేలే అసలు సిసలు ప్రాధాన్యంగా భావించి వరాల జల్లు కురిపిం చింది. ఎప్పుడెప్పుడా అని సూపర్‌సిక్స్ హామీల అమలుకు ఎదురుచూస్తోన్న లబ్ధిదారులకు తీపిక బురు అందించింది. గత వైసీపీ ప్రభుత్వం అలవి మాలిన అప్పులతో ఖజానాను గుల్ల చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించినా.. ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబ డుతూ ఇచ్చిన హామీల అమలుకు నిధుల విది లింపుతో తమది చేతల ప్రభుత్వమని విత్తమంత్రి చూపించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వంద నం, మహిళల ఉచితబస్సు ప్రయాణానికి త్వరలో శ్రీకారం చుడుతున్నామని ప్రకటించి పేద, మధ్య తరగతి వర్గాలను ఉత్సాహపరిచారు. వ్యవసాయా నికి తూట్లు పొడిచి అన్న దాతల సిరిని అటకెక్కించిన గత వైసీపీ ప్రభుత్వ పాతకానికి చరమగీతం పాడుతూ తిరిగి ఎన్టీఆర్ జలసిరి పథకానికి బడ్జెట్‌లో ఊపిరిపోశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి రాష్ట్రబడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా వికసించింది. బడ్జెట్ ప్రకటన మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క అన్నదాత సుఖీభవ పథకం అమలుకే రాష్ట్రప్రభుత్వం 4.54 లక్షల మంది రైతులకు రూ.908 కోట్ల లబ్ధి జరగనుంది.
అన్నదాతలకు ఆనందం..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం ధగాతో మోసపో యిన అన్నదాతలను ఆదుకుంటామని ప్రకటిం చింది. అర్హులైన ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించారు. ఉమ్మ డి జిల్లాలో మొత్తం 4.54 లక్షల మంది రైతులకు పథకం ద్వారా రూ.908 కోట్ల లబ్ధి చేకూరనుంది. కాకినాడ జిల్లాలో 1.86 లక్షల మంది అన్నదా తలకు రూ.370 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 1.21 లక్షలు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1.65 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. సున్నా వడ్డీ రుణాలకు బడ్జెట్‌లో రూ.628 కోట్లు ప్రక టించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 3.01 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇందులో ఒక్క కాకినాడ జిల్లాలో 96,383మంది అన్న దాతలకు మేలు జరగనుంది. వీరంతా రూ.22 కోట్ల వరకు వినియోగించుకునే అవకాశం ఏర్ప డింది. అన్నదాతలకు అండగా నిలబడేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పథ కాన్ని అమలు చేసింది. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా రైతులకు బోర్లు కొట్టించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వంలో తిరిగి ఎన్టీఆర్ జలసిరి పథకానికి ఊపిరిపోసింది. రూ.50 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. దీంతో తిరిగి అన్నదాతలకు మంచి రోజులు వచ్చినట్లయింది.
తల్లికి వందనమే..
బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తునట్టు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల ప్రకటించారు.దీంతో లక్షల మంది పేద, మధ్య తరగతి తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఎన్నికలకు ముందు టీడీపీ ఈ పథకాన్ని ప్రకటించింది. తాము అధికారంలోకి రాగానే తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలను బడులకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేల చొప్పున ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రాధాన్యం కల్పిం చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 16.51 లక్షల మంది పిల్లలకు సంబంధించి వారి తల్లులకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థికి ఏటా రూ.15 వేల చొప్పున ఉమ్మడి జిల్లాకే ఏకంగా రూ.2,476 కోట్ల వరకు నిధుల అవసరం.ఇందులో ఒక్క కాకినాడ జిల్లా చూసు కుంటే 6.20 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం కలగనుంది. ఒక్క కాకినాడ జిల్లాకు చూస్తే ఆర్థిక భారం రూ.930కోట్ల వరకు ఉంది.
ఇక రైట్‌రైట్..
గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఆర్టీసీ ఛార్జీలను పెంచేసి పేదల నడ్డివిరగ్గొట్టింది. కొద్ది పాటి దూరానికే షాక్ కొట్టే ఛార్జీలు వసూలు చేసింది.బయట పెట్రోలు, డీజిల్ ధరలు పెరగ డంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంటిని నడిపే ఇల్లాలి సంక్షేమం కోసం ఎన్నికలకు ముందు టీడీపీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రకటించింది. కూటమిని గెలిపిస్తే జిల్లాలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచి తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయా ణించేలా పథకం అమలు చేస్తా మని హామీఇచ్చింది. ఈ నేపథ్యం లో ఈ పథకాన్ని త్వరలో అమ లు చేయనున్నట్టు బడ్జెట్ ప్రసం గం సందర్భంగా మంత్రి పయ్యా వుల ప్రకటించారు.ఈ పథకంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 25.52 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కిందకు రానున్నారు. వీరిలో ఒక్క కాకినాడ జిల్లాలో 9.50లక్షల మం దికి ప్రయోజనం జరగనుంది.
ప్రకృతి సాగుకు పండగే..
ఉమ్మడి జిల్లాలో ఏటా ప్రకృతిసాగు విస్తీర్ణం పెరుగుతోంది.ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి రూ.422 కోట్లు కేటాయించింది. దీంతో ఈ విధానం కింద సాగుచేసే రైతులకు ఆర్థిక సహ కారం అందనుంది. ఉమ్మడి జిల్లాలో వరి, ఇతర వాణిజ్య పంటలు దాదాపు పదివేల ఎకరాల్లో ప్రకృతి సాగు కింద ఉన్నాయి. కాకినాడ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, దీనికి మరింత కట్టుబడి ఉంటామని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రక టించింది. దీంతో స్మార్ట్‌సిటీకి మరింత ఆర్థిక దన్ను లభించనుంది. రూ.50 వేల నుంచి 99,999 మంది జనాభా ఉన్న రెండో తరగతి పట్టణాల్లో జీఐఎస్ ఆధారిత బృహత్తర ప్ర ణాళికల రూప కల్పన చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మండ పేట, రామచంద్రపురం,పిఠాపురం తది తర పట్టణాలకు మహర్దశ పట్ట నుంది.ఈ ప్రణా ళికతో పట్టణాల్లో ప్రజల జీవన విధానం, భవి ష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్‌కు పరిష్కారం, భవిష్యత్తు అభివృద్ధిపై ప్రణాళికలతో మరింత మెరుగుపడనున్నాయి.
రహదారుల నిర్మాణం
రాజమహేంద్రవరంలో మరో ప్రత్యేక పోలీసు బెటాలియన్‌ను ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూ డి మండలం పరిధిలోని గోదావరిలో నిర్మిస్తు న్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత కల్పించారు.ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో బీసీలకు ఇళ్ల నిర్మాణానికి ప్రధాని ఆవాజ్ యోజన పథకం కింద రూ.లక్షా 30 వేలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.50వేలు ఇవ్వనుంది. దీంతో పేద, మధ్య తరగతి బీసీ లకే సొంతిల్లు కట్టుకోవడానికి వెసులుబాటు దొరికినట్టు అయింది. మిగతా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తక్కువగా ఉంది.జిల్లాలో రహ దారి పనులన్నీ 2025 మార్చినాటికి పూర్తి చేయనుంది.బీసీ సబ్ ప్లాన్‌కు ఏడాదికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేయనుంది. బీసీల స్వయం ఉపాధికి ప్రత్యేక పథకాలు తీసు కుని రాను న్నట్టు ప్రకటించారు.అభివృద్ధిపరంగా రోడ్లు, డ్రెయిన్లు,భవనాలు నిర్మించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన రోడ్లన్నీ వచ్చే మార్చిలోపు నిర్మించడానికి నిధులు కేటాయించారు. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలన్నింటికీ డబుల్ లేన్ రోడ్ల నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. గోదావరి జిల్లాలకు అన్నం పెట్టే ఇరిగేషన్ సిస్టమ్ అభివృద్ధికి భారీ గానే నిధులు కేటాయించినట్టు అధికారులు చెబుతున్నారు. తాము డెల్టా కాలువల అభి వృద్ధితో పాటు గోదావరి ఏటిగట్లు, పొలాలు కోతలకు గురికాకుండా గ్రోయిన్ల నిర్మాణ ప్రతి పాదనలు పంపామని,ఈసారి భారీగా నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో వివరంగా కేటాయింపులొస్తాయన్నారు.
ఫ అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రూ.4,500 కోట్లు కేటాయింపు..ఉమ్మడి జిల్లాలో 4.54 లక్షల మంది రైతులకు పథకం ద్వారా రూ.908 కోట్ల లబ్ధి
ఫ తల్లికి వందనం పథకం నిధుల కేటాయింపునకు ఓకే.. ఒకటి నుంచి ఇంటర్ వరకు జిల్లాలో 16.51 లక్షల మంది తల్లులకు ప్రయోజనం. లబ్ధిదారులకు రూ.15 వేల చొప్పున జిల్లా అంతటికి రూ.2,476 కోట్ల వరకు నిధుల అవసరం
ఫ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సైతం త్వరలో అమలు చేస్తామని ప్రకటన.. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 19 లక్షల మంది వరకు ప్రయోజనం
ఇది అభివృద్ధికి తొలిమెట్టు
ఇది నాలుగు నెలల బడ్జెట్. గత ఐదేళ్లలో గాడితప్పిన ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించే బడ్జెట్ ఇది. రాబోయే ఐదేళ్లలో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షే మాలకు ఇది తొలి మెట్టు. ఏపి సమగ్రా భివృద్ధికి తొలి అడుగు. టూరిజం, స్పోర్ట్స్, యూత్ కోసం రూ.328 కోట్లు కేటాయిం చాం.
- కందుల దుర్గేష్, మంత్రి
అభివృద్ధి- సంక్షేమంపై దృష్టి
ఆర్థిక ఇబ్బందు ల్లో ఉన్న రాష్ర్టానికి ఇది అద్భుత బడ్జెట్. అభివృద్ధి- సంక్షేమా నికి సమ ప్రాధా న్యత ఇచ్చింది. వ్యవసాయం.. ఇరిగేషన్.. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పించింది. సూపర్‌సిక్స్ అమలు వేగవంతం చేసింది.
- గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే
అద్భుత బడ్జెట్ ఇది..
తీవ్ర కష్టాలో ఉన్న రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధిని పరు గెత్తించే విఽఽధంగా బడ్జెట్ ఉంది. ఇది కేవలం భవిష్యత్ దృష్టి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యం. మౌలిక వసతులు, గ్రామీణా భివృద్ధి వ్యవసాయానికి అధిక ప్రాధా న్యత ఇచ్చారు.
- నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే
ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది
ఈ బడ్జెట్ ప్రజల్లో నమ్మకాన్ని కలిగిం చింది. వైసీపీ అనాలోచిత విధా నాల వల్ల అప్పుల పాలైన రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బడ్జెట్ ఇది. సంక్షేమం- అభివృద్ధి రెండిండికి ప్రాధాన్యత ఉంది. బీసీ, ఎస్పీ, ఎస్సీ సబ్-ప్లాన్ నిధులతోపాటు అన్నివర్గాల సంక్షేమానికి నిధులు కేటాయించింది.
- ఆదిరెడ్డి శ్రీనివాసు,
రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే
రైతు సంక్షేమానికి పెద్దపీట
ఈ బడ్జెట్ ఎక్స్ లెంట్. రైతు సంక్షే మానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి అన్ని విధాలా ఉప యోగపడేది. శిఽథిలావస్థలో ఉన్న ఎడ్యుకేషన్, వైద్య రంగాల్లో వినూత్న మార్పులు తేనుంది. అభివృద్ధితోపాటు సంక్షేమం కచ్చితంగా అమలుచేసే బడ్జెట్ ఇది. పేదల సంక్షేమం బడ్జెట్ ఇది.
- బత్తుల బలరామకృష్ణ
రాజానగరం ఎమ్మెల్యే
అసమానతలు తగ్గించే బడ్జెట్
ఈ బడ్జెట్ సమా జంలోని ఆర్థిక అసమానతలను తగ్గించే విధంగా ఉంది. గత ప్రభుత్వ వైఖరి వల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇది అభివృద్ధి- సంక్షేమంతో కూడి ఉంది. రైతులు, కూలీలు, మహిళలు, వివిధ వర్గాల ఎదుగుదలకు ప్రాధాన్యత కలిగించింది.
మద్దిపాటి వెంకట్రాజు,
గోపాలపురం ఎమ్మెల్యే
ఇది సూపర్ బడ్జెట్
కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా నడిపించాలో సీఎం చంద్రబాబుకు తెలుసు.. అందుకే మార్చి వరకు ఓ పునాదిగా సంక్షేమ అభివృద్ధితో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది సూపర్ బడ్జెట్.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
ముప్పిడి వెంకటేశ్వరరావు,
కొవ్వూరు ఎమ్మెల్యే