Share News

15 ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులు

ABN , Publish Date - Jan 27 , 2024 | 12:42 AM

ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవ డంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు గురువారం నుంచి సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే.జిల్లాలో కోట్లాది రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు 4 నెలల నుంచి బిల్లులు ఇవ్వడం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నా యి.

15 ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులు

రాజమహేంద్రవరం, జనవరి 26(ఆంధ్ర జ్యోతి) : ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవ డంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు గురువారం నుంచి సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే.జిల్లాలో కోట్లాది రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు 4 నెలల నుంచి బిల్లులు ఇవ్వడం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నా యి. సేవలు నిలిపివేయడంతో జిల్లాలో సు మారు 15 ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీ సు లు ఇచ్చినట్టు సమాచారం.ఒప్పందంలో బిల్లు లు సకాలంలో ఇస్తామని తెలిపా రని, ఇవాళ బిల్లులు ఇవ్వకుండా వైద్యం చేస్తూ ఆసుపత్రు లను ఎలా నిర్వహించగలమని ఆసుపత్రి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి ఆరోగ్యశ్రీ అధికారులు మాత్రం సమస్య పరి ష్కారం అవుతుందని, ఇప్పటికే కొంత మేర బిల్లులు విడుదలయ్యా యని చెబుతున్నారు .ప్రభుత్వం డీఎంహెచ్‌వో ద్వారా ఆసుపత్రు లపై ఒత్తిడి చేసే పనిలో నిమగ్న మైనట్టు సమాచారం.దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆపరేషన్లు వాయిదా పడుతున్నట్టు సమాచారం.

Updated Date - Jan 27 , 2024 | 12:42 AM