ఏటీఎం కార్డు మార్చి రూ.33,500 అపహరణ
ABN , Publish Date - Aug 05 , 2024 | 11:22 PM
కొవ్వూరు మండలం పంగిడిలో ఏటీఎం కార్డు మార్చి మాయచేసి రూ.33,500 అపహరించారు. గ్రామానికి చెందిన జైళ్ల శాఖ రిటైర్డ్ ఉద్యోగి రేలంగి నారాయణరావు శనివారం స్థానిక ఏటీఎం వద్దకు వెళ్లాడు. సొమ్ము రాకపోవడంతో బయకు వచ్చాడు. అక్కడే పొంచి ఉన్న ఓ వ్యక్తి యూనియన్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు వస్తున్నాయని చెప్పడంతో ఇద్దరూ అక్కడికి వద్దకు వచ్చారు...
కొవ్వూరు, ఆగస్టు 5: కొవ్వూరు మండలం పంగిడిలో ఏటీఎం కార్డు మార్చి మాయచేసి రూ.33,500 అపహరించారు. గ్రామానికి చెందిన జైళ్ల శాఖ రిటైర్డ్ ఉద్యోగి రేలంగి నారాయణరావు శనివారం స్థానిక ఏటీఎం వద్దకు వెళ్లాడు. సొమ్ము రాకపోవడంతో బయకు వచ్చాడు. అక్కడే పొంచి ఉన్న ఓ వ్యక్తి యూనియన్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు వస్తున్నాయని చెప్పడంతో ఇద్దరూ అక్కడికి వద్దకు వచ్చారు. ఆ వ్యక్తి.. నారాయణరావుకు సహకరిస్తున్నట్టు నటించిన ఏటీఎంలో కార్డును పెట్టి బ్యాలెన్స్ ఎంత ఉందో చూశాడు. డబ్బులు తీయకుండా బ్యాలెన్స్ చూస్తున్నావేంటి అని ప్రశ్నించడంతో పొరపాటున విత్‌డ్రాకు బదులు బ్యాలెన్స్ బటన్ నొక్కానని చెప్పి మాయచేసి కార్డు మార్చివేసి డూప్లికేట్ కార్డును నారాయణరావుకు ఇచ్చాడు. ఆ కార్డుతో డబ్బులు డ్రా చేయగా ఎంతకి సొమ్ము రాకపోవడంతో బ్యాంకుకు వెళ్లమని చెప్పి ఆ వ్యక్తి మోటారుసైకిల్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నారాయణరావు ఇంటికి వెళ్లిపోయిన కొద్దిసేపటికి చాగల్లు ఏటీఎం నుంచి రూ.20 వేలు, నిడదవోలులో రూ.10వేలు, రూ.3500 మూడుసార్లు డ్రా చేసినట్టు సెల్‌ఫోన్‌కి మెసేజ్ రావడంతో నారాయణరావు కొవ్వూరు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. తన బ్యాంకు ఖాతాలో రూ.33,620 ఉండగా గుర్తుతెలియని వ్యక్తి తన ఏటీఎం కార్డు మార్చివేసి రూ.33,500 అపహరించినట్టు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా దొంగతనానికి పాల్పడిన వ్యక్తి తలపై టోపి పెట్టుకుని ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఏటీఎంలో లభించిన సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.