చదువుతో పాటు క్రీడలు అవసరం
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:12 AM
బిక్కవోలు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): చదువుతో పాటు క్రీడలు ప్రతి విద్యార్థికి అవసరమని తూర్పుగోదావరి జిల్లా విద్యా శాఖాధికారి పి.వాసుదేవరావు అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు జడ్పీ హైస్కూల్ ప్లస్‌లో నిర్వహిస్తున్న 68వ అంతర జిల్లాల బాల్
తూర్పుగోదావరి జిల్లా డీఈవో వాసుదేవరావు
బిక్కవోలులో ముగిసిన అంతర జిల్లాల బాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
గుంటూరు ప్రథమం, శ్రీకాకుళం ద్వితీయ స్థానాలు కైవసం
బిక్కవోలు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): చదువుతో పాటు క్రీడలు ప్రతి విద్యార్థికి అవసరమని తూర్పుగోదావరి జిల్లా విద్యా శాఖాధికారి పి.వాసుదేవరావు అన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు జడ్పీ హైస్కూల్ ప్లస్‌లో నిర్వహిస్తున్న 68వ అంతర జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ అండర్-17 బాలికల పోటీలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో డీఈవో మాట్లాడుతూ క్రీడలకు గతంలో 2శాతం కోటా ఉండేదని దానిని కూటమి ప్రభుత్వం 3శాతానికి పెంచిందని, క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. తల్లిదండ్రులందరూ విద్యార్థుల చదువుతో పాటు క్రీ డలను ప్రోత్సహించాలని సూచించారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో స్థానాలు సాధించిన గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ, ప్రకా శం జట్ల బాలికలకు ఆయన ట్రోఫీలు అందజేశారు. క్రీడలు ద్విగిజయంగా నిర్వహించిన జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎస్‌ఆర్‌కేవీ. స్వామిని, పీడీ అసోషియేషన్ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల అబ్జర్వర్ సీహెచ్ రజినీదేవి, హెచ్‌ఎం పి.వీరప్రభాకరరావు, పీడీ, పీఈటీ అసోషియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, గౌరవాధ్యక్షుడు నల్లమిల్లి అప్పారెడ్డి, అనపర్తి జోన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి టీవీ. రాఘవరెడ్డి, పీడీలు వై.బంగార్రాజు, మానుకొండ ధనరాజు, నందిపాటి శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి యువరాజారెడ్డి, వీకేఆర్.తంబి, ప్రభాకర్‌రెడ్డి, ఎంఈవో కె.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.
హోరాహోరీగా పోటీలు...
ఫైనల్స్‌లో గుంటూరు-శ్రీకాకుళం మధ్య జరిగిన పోటీలు హోరాహోరీగా సాగాయి. గుంటూరు 35-27, 35-27 స్కోరుతో శ్రీకాకుళంపై విజయం సాఽధించి ప్రథమ స్థానం సాధించగా, శ్రీకాకుళం జట్టు ద్వితీయ స్థానం పొందింది.. అలాగే విశాఖ.. ప్రకాశం జట్టుపై 35-30, 35-31 స్కో రుతో గెలుపొంది ద్వితీయ స్థానం పొందగా ప్రకా శం జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.