రైతుల్లో కలవరం
ABN , Publish Date - Nov 13 , 2024 | 01:18 AM
ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని సాగు చేసిన వరి పంట చేతికందుతున్న వేళ మారిన వాతావరణ పరిస్థితులు రైతుల్లో కలవరం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆకాశం మేఘావృతం కావడంతో పాటు వర్షం కురవడం వారిలో మరింత అందోళ న పెంచింది. వర్షానికి అక్కడక్కడా ధాన్యం రా శులు స్వల్పంగా తడిచాయి. భారీ వర్షాలు పడితే నష్టపోతామని రైతులు కలవరపడుతున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనంతో మారిన వాతావరణం
వర్షంతో అక్కడక్కడా స్వల్పంగా తడిచిన ధాన్యం రాశులు
కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట
పొలాల్లోనే పనలు, ధాన్యం
అధిక వర్షాలు పడితే నష్టపోతామని రైతుల్లో ఆందోళన
ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని సాగు చేసిన వరి పంట చేతికందుతున్న వేళ మారిన వాతావరణ పరిస్థితులు రైతుల్లో కలవరం సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆకాశం మేఘావృతం కావడంతో పాటు వర్షం కురవడం వారిలో మరింత అందోళ న పెంచింది. వర్షానికి అక్కడక్కడా ధాన్యం రా శులు స్వల్పంగా తడిచాయి. భారీ వర్షాలు పడితే నష్టపోతామని రైతులు కలవరపడుతున్నారు.
పిఠాపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): బం గాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం సాయంత్రం నుంచి వాతారవరణం లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశం మే ఘావృతం కావడంతోపాటు మంగళవారం ఉద యమే పిఠాపురం, గొల్లప్రోలు పరిసర ప్రాంతా ల్లో వర్షం పడింది. సార్వా వరికోతలు, మాసూళ్లు ప్రారంభమైన సమయంలో కురిసిన వర్షం, వె న్నాడుతున్నా మేఘాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అష్టకష్టాలు పడి పంటలను సాగు చేసి ఇంటికి తెచ్చుకునే వేళ అల్పపీడనం ఏర్పడడం వారికి కలవరాన్ని కలిగి స్తోంది. వర్షానికి అక్కడక్కడా తడిచిన ధాన్యం రాశులను ఆరబెట్టుకోవడంలో రైతులు నిమగ్నమయ్యారు. వరి కోతలు ప్రారంభిద్దామని భావిస్తున్న రైతులు వరికోత యంత్రాల ద్వారా మా సూళ్లు పూర్తికి ప్రయత్నిస్తున్నారు.
ఆది నుంచి కష్టాలే
ఈ ఏడాది సార్వా సాగులో రైతులు ఆది నుం చి కష్టాలు ఎదుర్కొన్నారు. సాగు ప్రారంభ సమయంలో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు కనిష్ఠస్థాయి కంటే దిగువకు చేరింది. కూటమి ప్రభుత్వం స్పందించి పురుషోత్తపట్నం ఎత్తిపోత ల పథకాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చి గోదావరి జలాలను ఏలేరుకు మళ్లించింది. దీంతో ప్రా జెక్టు నుంచి నీరు విడుదల ప్రారంభమైంది. దీని వల్ల ఏలేరు, పీబీసీ ఆయకట్టు పరిధిలోని 1.07 లక్షల ఎకరాల్లో వరి తదితర పంటలను రైతులు సాగుచేశారు. నాట్లు పూర్తయి పంటలు ఆశాజనంగా ఉండగా తుఫాన్ విరుచుకుపడి భారీ వర్షాలతో ఏలేరు, సుద్దగడ్డకు వరదలు వచ్చి ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది.
పెట్టుబడులయినా వస్తాయని..
వరదలు భారీనష్టం కలిగించినా తేరుకున్న రైతులు వరిపంటపై మళ్లీ పెట్టుబడులుపెట్టారు. 50శాతం దిగుబడులైనా వస్తాయని, తద్వారా పెట్టుబడులు దక్కించుకోవచ్చునని రైతులు ఆ శించారు. అదనంగా పెట్టుబడులు పెట్టిన ఈ నిక దశ వచ్చే సమయానికి పంటపై తె గుళ్లు ఆశించాయి. పురుగుమందులు పిచికారీ చేయాల్సి వచ్చింది.
పంట చేతికందే వేళ
ఏలేరు, పీబీసీ ఆయకట్టుతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఏలే రు, పీబీసీ ఆయకట్టులో 10శాతం విస్తీర్ణంలో కోతలు, మాసూళ్లు పూర్తయ్యాయి. ఎక్కువ ప్రాంతాల్లో వరికోత యంత్రాల ద్వారా మాసూళ్లు నిర్వహించడంతో రైతులు ఎక్కడిక్కడ కళ్లాల్లో దాన్యాన్ని ఆరబెట్టారు. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో పొలాల్లోనే ధాన్యం రాశులు ఉండిపోయా యి.ఇదే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రైతులు అందోళన చెందుతున్నారు. పం టను ఒబ్బిడి చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి అక్కడక్కడ ధాన్యం రాశులు స్వల్పంగా తడిచాయి. మళ్లీ ఎండ కాయడం తో రైతులు ధాన్యం రా శులను కళ్లాలు,జాతీయ రహదారులు, గ్రామీణ రో డ్లు వెంబడి ఆరబెట్టారు. మధ్యాహ్నంనుంచి మళ్లీ ఆ కాశంలో మబ్బులతో రైతు ల్లో కలవరం మొదలైంది.
భారీ వర్షాలు పడితే..
అల్పపీడన ప్రభావం కాకినాడ జిల్లాపై అంత గా ఉండదని వాతావరణశాఖ చెప్పినా వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు భారీ వర్షాలు పడితే వరిపంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఏలేరు, పీబీసీ ఆయకట్టులో మరో 20శా తం విస్తీర్ణంలో వరి పంట కోతకు సిద్ధంగా ఉం ది. మిగిలిన విస్తీర్ణంలో ఈనిక దశ, వరి కంకుల్లో గింజ గట్టిడే దశలో పంట ఉంది. ఈ సమయంలో వర్షాలు పడి గాలులు వీస్తే పంట నేలనంటుతుందని, గింజ పొల్లుబారిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సార్వా వరి పంట చేతికందే సమయంలో తుఫాన్లు ఏర్పడి, పంటకు నష్టం కలిగించడం రెండుదశాబ్ధాలుగా జరుగుతోంది. ప్రతిఏటా ఈ సమయంలో వర్షా లు వెన్నాడటం సర్వసాధారణంగా మారింది. రైతులు భారీగా పంటలను నష్టపోయారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యవసాయశాఖ ముందస్తు సాగుచేయాలని విస్తృత ప్రచారం సాగిస్తోంది.
రైతులంతా అప్రమత్తంగా ఉండాలి
కోటనందూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా 2.25లక్షల ఎకరాల్లో వరిపంట ఉంది. ఇందులో ఎక్కువగా 1064, 1061, ఆర్‌జీఎల్, స్వర్ణ వంటి రకాలున్నాయి. ఈ ఏడాది ఊడ్చిన దగ్గర నుంచి తుపాన్ ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో కామన్ ధర రకం 75 కిలోల బస్తాకు రూ.1725, సన్నరకం రూ.1740గా ప్రకటించడంతో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.
-సుంకర బుల్లిబాబు, వ్యవసాయశాఖ ఏడీ, తుని సబ్ డివిజన్
కోత మిషన్లకు గిరాకీ
కొత్తపల్లి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభా వంతో కురుస్తున్న వర్షాలకు త్వరగా పంటను ఒబ్బిడి చేసు కునేందుకు రైతులు ఆరాటపడుతున్నారు. రైతులంతా కోత మిషన్‌లతో కోత కోయించుకొనేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో వాటికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. కొత్తపల్లి మండలంలో కోత కోసేందుకు నాలుగైదు మిషన్లు పనిచేస్తు న్నాయి. ఈ మిషన్‌లను పెద్ద రైతులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడంతో సన్న, చిన్నకారు రైతులు పంటలను ఒబ్బిడి చేసుకొనేందుకు వీలుపడక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అల్పపీడన ప్రభావంతో కొత్తపల్లిలో సోమవారం అర్ధ రాత్రి భారీగా కురిసిన వర్షానికి పలు గ్రామాల్లో కోత కోసి న వరిపనలు నీట మునిగాయి. మండలంలోని కొత్తపల్లి, వాకతిప్ప, కొండెవరం, కుతుకుడుమిల్లి గ్రామాల్లో కోతమిష న్‌లు దిగని చేలల్లో రైతులు కూలీలతో కోతలు కోయించుకు న్నారు. కూలీలతో కోత కోసిన చేలు మూడు,నాలుగు రోజుల వ్యవధిలో పన కట్టించుకుని కుప్పవేస్తారు. ఇలా కోత కోసిన పనలు గత అర్ధరాత్రి భారీ వర్షాలకు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.