బీసీ హాస్టల్ విద్యార్థుల ర్యాలీ
ABN , Publish Date - Nov 12 , 2024 | 01:16 AM
రాజోలులో బీసీ హాస్టల్ విద్యార్థులు హాస్టల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.
రాజోలు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాజోలులో బీసీ హాస్టల్ విద్యార్థులు హాస్టల్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. గత రెండు నెలలుగా హాస్టల్‌లో భోజనం సరిగా పెట్టడం లేదంటూ అన్నమైనా పెట్టండి,. జైలులో అయినా పెట్టండి అంటూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెస్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని రాజోలు తహశీల్దార్ ప్రసాద్‌కు ఏఐఎస్‌ఎఫ్ నాయకులు దేవ రాజేంద్రప్రసాద్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టి మెస్ చార్జీల బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.