మీ కోసమే వచ్చా.. బాధలు తీరుస్తా!
ABN , Publish Date - Jan 27 , 2024 | 12:41 AM
మనదంతా ఒకటే కుటుంబం.. మీకు ఎప్పుడు ఏ కష్ట మొచ్చినా చంద్రబాబు చలించిపోయేవారు.. తక్షణం ఆదుకునే వరకు ఆరాటపడేవారు.. అటువంటి చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెడితే మాతో సమంగా మీరంతా ఎంతో చలించిపోయారు.చంద్రబాబు పడే కష్టం, బాధలు చూసి ఆయన్ని అభిమానించి ఆరాధించే మన కుటుంబంలో ఎన్నో గుండెలు కొట్టుకోవడం ఆగిపోయాయి..అని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.
3 నియోజకవర్గాల్లో పర్యటన
ఐదు కుటుంబాలకు పరామర్శ
ధైర్యం చెప్పిన భువనమ్మ
రూ.3 లక్షల చొప్పున చెక్‌లు
వెంట నడిచిన నాయకులు
ముగిసిన పర్యటన
హైదరాబాద్‌కు పయనం
బిక్కవోలు/నిడదవోలు/సీతానగరం, జనవరి 26 : మనదంతా ఒకటే కుటుంబం.. మీకు ఎప్పుడు ఏ కష్ట మొచ్చినా చంద్రబాబు చలించిపోయేవారు.. తక్షణం ఆదుకునే వరకు ఆరాటపడేవారు.. అటువంటి చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెడితే మాతో సమంగా మీరంతా ఎంతో చలించిపోయారు.చంద్రబాబు పడే కష్టం, బాధలు చూసి ఆయన్ని అభిమానించి ఆరాధించే మన కుటుంబంలో ఎన్నో గుండెలు కొట్టుకోవడం ఆగిపోయాయి..అని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఆ గుండెల బాధను మీతో మాట్లాడి తీర్చాలని వచ్చా అన్నారు. బిక్కవోలు,సీతానగరం మండలం కాటవరం, నిడదవోలు మం డలం కలవచర్ల, పందలపర్రు, తిమ్మరాజుపాలెం గ్రామాల్లో శుక్రవారం నిజం గెలవాలి యాత్ర నిర్వహించారు.ఉదయం బిక్కవోలులో ఒక కుటుంబాన్ని పరామర్శించి అనంతరం నిడదవోలుకు వెళ్లారు.బాధిత కుటుంబీకులను పరామర్శించారు.ఽ ధైర్యంగా ఉండండి అంటూ భరోసా ఇచ్చారు.ఒక్కో కుటుంబా నికి రూ. 3 లక్షల చొప్పున చెక్కు అందజేశారు. అనంతరం కాటవరం వెళ్లారు. అడుగడుగునా కార్యకర్తలు, నేతలు స్వాగతం పలికారు. పలు గ్రామాల్లో భారీ ఫ్లెక్స్ లు, టీడీపీ జెండాలతో పసుపుమయం చేశారు. పలువురు మహిళలు ఆమెను కలవగా వారిని ఆమె ఆప్యాయంగా పలుకరించారు.ఆమె వెంట టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మె ల్యే బూరుగుపల్లి శేషారావు తదితరులు ఉన్నారు.
బిక్కవోలులో.. ఓదార్పు
బిక్కవోలు, జనవరి 26: టీడీపీ కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని నారా భువనేశ్వరి తెలిపారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బిక్కవోలు గ్రామంలోని రొక్కల రాణి కుటుంబీకులను పరామర్శించారు.రాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. కుటుంబీకులకు రూ.3 లక్షల చెక్కును అందజేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టులకు నిరసనగా దళిత నేతలు చేపట్టిన రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న పెదపూడి మండలం రాజుపాలెంకు చెందిన కందుకూరి పెదసత్తియ్య అస్వస్థతకు గురవ్వడంతో అతనికి భువనేశ్వరి రూ.20 వేలు సాయం అందించారు.
మీకు నేనున్నా.. కంగారొద్దు
నిడదవోలు : టీడీపీ సీనియర్ నాయకుడిగా మా జీ సర్పంచ్‌గా ఏఎంసీ మాజీ వైస్ చైర్మెన్‌గా బోగిరెడ్డి సత్యనారాయణ(బూరయ్య) సేవలు చిరస్మరణీయ మని నారా భువనేశ్వరి అన్నారు. నిడదవోలు మండ లం పందలపర్రులో బూరయ్య కుటుంబీకులను ఆమె పరామర్శించి ఓదార్చారు. మీరంతా ధైర్యంగా ఉండి నిజం గెలిపించాలన్నారు. మనం అంతా కష్టసుఖాల్లో కలిసే ఉంటాం.. కలిసే ప్రయాణం చేస్తాం.. అంటూ బూరయ్య భార్యను ఓదార్చారు. ఆమె వెంట పందలపర్రు గ్రామ టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఉన్నారు.
తిమ్మరాజుపాలెంలో..
నిడదవోలు : చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన కుసుమే వెంకటలక్ష్మి గుండెపోటుతో మృతి చెందింది. ఈ మేరకు ఆమె కుటుంబీకులను భువనేశ్వరి పరామర్శించి కుసుమే వెంకటలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యురాలిని కోల్పోవడం బాధాకరమన్నారు.
అభయమిచ్చి..అండగా నిలిచి
నిడదవోలు : టీడీపీ అంటే నిడదవోలు మండలం కలవచర్ల గ్రామానికి చెందిన మన్నెం శ్రీనివాసరావుకు ప్రాణం.. ఎక్కడ టీడీపీ కార్యక్రమం జరిగినా...భుజాన టీడీపీ జెండా మోస్తూ అందరికంటే ముందు ఉండే వాడు..చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై అకస్మాత్తుగా గుండె ఆగి మరణించాడు. శుక్రవారం నారా భువనేశ్వరి, శ్రీను కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
కాటవరం వెళ్లి.. కన్నీళ్లు తుడిచి
సీతానగరం : చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కాటవరం గ్రామానికి చెందిన దాసరి హరిప్రసాద్ కుటుంబీకులను శుక్రవారం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించారు. ముందుగా మృతుడి సోద రులు దాసరి అప్పారావు, దాసరి శ్రీనివాసరావు లను ఓదార్చారు.అనంతరం రూ.3 లక్షల చెక్కు అందించారు. ఆమె వెంట ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి జవ హర్,రాజానగరం టీడీపీ ఇన్‌చార్జి బీవీఆర్ చౌదరి ఉన్నారు.
భువనేశ్వరికి ఘన వీడ్కోలు
కోరుకొండ : జిల్లాలో ‘‘నిజం గెలవాలి’’ యాత్ర ముగించుకుని శుక్రవారం హైదరాబాద్ బయలుదేరిన నారా భువనేశ్వరికి మధురపూడి విమానాశ్రయం వద్ద పలువురు టీడీపీ నాయకులు వీడ్కోలు పలికారు.రాజానగరం టీడీపీ ఇన్‌చార్జ్ బీవీఆర్ చౌదరి, ఎమ్మెల్యేలు చినరాజప్ప, గోరంట్ల, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,బూరుగుపల్లి శేషారావు, మందలపు రవి, చిట్టూరి రంగారావు, పోలిన కృష్ణ, తదితరులు ఉన్నారు.