Share News

క్యాన్సర్‌పై అవగాహనకు పోస్టర్ల ఆవిష్కరణ

ABN , Publish Date - Aug 12 , 2024 | 12:31 AM

కమ్యూనిటీ పారా మెడికల్‌ అండ్‌ ప్రైమరీ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(పీఎంపీ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్యాన్సర్‌పై అవగాహన కల్పించే దిశగా ఏర్పాటుచేసిన కరపత్రా లను, వాల్‌ పోస్టర్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆవిష్కరించారు.

క్యాన్సర్‌పై అవగాహనకు పోస్టర్ల ఆవిష్కరణ

రాజమహేంద్రవరంకల్చరల్‌, ఆగస్టు 11: కమ్యూనిటీ పారా మెడికల్‌ అండ్‌ ప్రైమరీ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(పీఎంపీ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్యాన్సర్‌పై అవగాహన కల్పించే దిశగా ఏర్పాటుచేసిన కరపత్రా లను, వాల్‌ పోస్టర్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎక్కువమంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, దానిపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన పీఎంపీలను అభినందించారు. ఈనెల 15 నుంచి ప్రభుత్వం నిర్యహించే క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ క్యాంప్‌లలో ప్రజ లు పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. పీఎంపీ సమస్యలు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి లోకేశ్‌ల దృష్టిలో ఉన్నాయన్నారు. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు యాళ్ల ప్రదీప్‌ సుకుమార్‌, తో రాటి ప్రభాకరరావు, వీబీటీ రాజు, బళ్ళా శ్రీనివాసరావు, పి.దేవా నందం, పి.చి న్ని, రహమాన్‌ఖాన్‌, మట్టా రమేష్‌, ప్రసాద్‌ బాబు, ఎం.జితేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2024 | 12:31 AM