బాల్యవివాహాలను ధైర్యంగా వ్యతిరేకించండి
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:24 AM
తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేయడానికి ప్రయత్నిస్తే పిల్లలు ధైర్యంగా వ్యతిరేకించి, చెల్డ్ హెల్ప్‌లైన్, పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి ఐసీఆర్ అనంతప్రదీప్ అన్నారు. శనివారం బొమ్మూరు జడ్పీ హైస్కూల్లో జిల్లా బా లల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన బాల్ వివాహ్‌ముక్త్ భారత్ కార్యక్రమానికి ప్రదీప్‌తోపాటు, జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్‌ఐసీ జి.క్రాంతి లాల్, ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి, మహిళా సంరక్షణ కార్యదర్శులు ప్రి యాంక, చాందిని విచ్చేశారు.
జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి ప్రదీప్
రాజమహేంద్రవరం రూరల్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేయడానికి ప్రయత్నిస్తే పిల్లలు ధైర్యంగా వ్యతిరేకించి, చెల్డ్ హెల్ప్‌లైన్, పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి ఐసీఆర్ అనంతప్రదీప్ అన్నారు. శనివారం బొమ్మూరు జడ్పీ హైస్కూల్లో జిల్లా బా లల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన బాల్ వివాహ్‌ముక్త్ భారత్ కార్యక్రమానికి ప్రదీప్‌తోపాటు, జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్‌ఐసీ జి.క్రాంతి లాల్, ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి, మహిళా సంరక్షణ కార్యదర్శులు ప్రి యాంక, చాందిని విచ్చేశారు. ఈ సందర్భంగా ప్ర దీప్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసే వారిపై బాల్యవివాహాలు నిషేధ చట్టం 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరి గితే గుర్తించి చెల్డ్‌హెల్ప్‌లైన్-1098, పోలీస్-100 లేదా అత్యవసర సహాయం-112కు ఫోను చేసి సమాచారం అందించాలన్నారు. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎస్‌ఎంసీ సభ్యులు ఎవెన్యు ఎం ఎస్‌డబ్ల్యూ స్టూడెంట్ రమేష్ పాల్గొన్నారు.