చిన్నారుల మృతిపై నిర్లక్ష్యాన్ని గుర్తించాం
ABN , Publish Date - Aug 07 , 2024 | 01:10 AM
వరుసగా చిన్నారులు మృతి చెందు తున్న ఘటనలపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య స్పందించారు.
బాధ్యులపై చర్యలు
ఆర్‌ఎంపీలు స్థాయిని మించి వైద్యం చేయవద్దు
నాటు మందు వినియోగంపై అవగాహన కల్పిస్తాం
చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య
చింతూరు, ఆగస్టు 6: వరుసగా చిన్నారులు మృతి చెందు తున్న ఘటనలపై అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య స్పందించారు. వీటిలో రెండు ప్రదేశాలలో చోటుచేసుకున్న నిర్లక్ష్యాన్ని గుర్తించామన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు పీవో పేర్కొన్నారు. చింతూరు మండలంలో గడచిన ఎనిమిది రోజుల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విషయం విధితమే. ఈ ఘటనలపై పీవో ఆరోగ్యశాఖతోపాటు రహస్యంగా మరో శాఖతో క్షేత్ర స్థాయి విచారణ చేయించారు. ఈ క్రమంలో మంగళవారం పీవో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించా రు. చిన్నారుల మృతికి కారణాలను తెలుసుకున్నామని ఐదు మరణాలలో రెండు మరణాలు నాటు మందు వాడడంవల్ల విషయం వెల్లడైందన్నారు. మరొక మరణం విషయంలో ఆర్‌ఎంపీ వైద్యుడి అరకొర వైద్యం కూడా కారణమే కావచ్చన్న నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. రెండు ప్రదేశాలలో చిన్నారుల ఆరోగ్య స్థితిగతులపై ఆరోగ్యశాఖకు చెందిన స్థానిక సిబ్బంది స్పందించకపోవడంతో సకాలంలో వారికి వైద్యం అందించే ప్రక్రియకు దూరం కావాల్సిన పరిస్థితిని గుర్తించా మన్నారు. దీంతో ఆ సిబ్బందిపై ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్లు పీవో తెలిపారు. చింతూరు డివిజన్ వ్యాప్తంగా ఏఎన్‌ఎంల స్థానచలన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నామ న్నారు. వ్యాఽధిగ్రస్తులకు సకా లంలో వైద్యం అందించే ప్రక్రియలో భాగంగా ఐటీడీఏలో టోల్‌ఫ్రి నెంబరు కేటాయిస్తున్నా మన్నారు. దోమతెరలు, ఫాగింగు తదితర పారిశుధ్యం చర్యలు తీసుకుంటున్నామన్నారు. చింతూరు ిసీహెచ్‌సీకి రెడ్‌క్రాస్ నుంచి వెంటిలేటరు సదుపాయం ఉన్న అంబులెన్సును తీసుకువస్తామన్నారు. డివిజన్ వ్యాప్తంగా వివిధ శాఖలతో కూడిన గ్రామసభలు నిర్వ హించి ఆరోగ్యంపై అవగాహనతో ఆయా ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదిక రూపొందించనున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, ఏరియా ఆసుపత్రి సూపరిం టెండెంట్ డా.కోటిరెడ్డి, చిన్నపిల్లల ప్రత్యేక నిపుణులు డాక్టర్ హర్ష, తదితరులు పాల్గొన్నారు.
బిడ్డ ప్రాణంకోసం నాటు మందు తీసుకున్నా
వాగు పొంగడంతో నాటుమందే శరణ్యమని భావించాం
చివరకు బిడ్డ ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయాం
ఓ తల్లి ఆవేదన
చింతూరు, ఆగస్టు 6: జలుబు, దగ్గుతో బిడ్డ ఊపి రి పీల్చుకోలేని స్థితి. ఆసుపత్రికి వెళదామంటే ఎడ తెరపిలేని వర్షం, వాగు పొంగి దారి కరువైంది. ఏం చేయాలో అర్ధం కాలేదు. ఎలాగైనా బిడ్డ ప్రాణాలు నిలుపుకోవాలనుకున్నాం. గత్యంతరం లేక నాటుమం దుని ఆశ్రయించాం. అయినా బిడ్డను కాపాడు కోలేక పోయాం. అల్లూరిసీతారామరాజు జిల్లా చింతూరు మండలం వంకగూడెంనకు చెందిన మహేష్, రమ్య ల నాలుగు నెలల పసిబిడ్డ సోమవారం భద్రాచలం లో మృతి చెందిన విషయం విధితమే. మహేష్, రమ్యలు తెలిపిన వివరాల మేరకు .. ఈనెల ఒకటోతేదీ నుంచి తమ నాలుగు నెలల బిడ్డ దగ్గుతో బాధపడుతోంది. ఇక రాత్రి సమయంలో ఊపిరి పీల్చు కోలేనిస్థితి. ఆసుపత్రికి తీసుకెళ్దాం అనుకుంటే ఏడుగు రాళ్ళపల్లి ప్రాథమిక వైద్యశాలకు వెళ్లాలి. ఎడతెరపిలేని వర్షం, వంక గూడెం నుంచి ఏడుగురాళ్ళపల్లి వెళ్లాంటే మార్గమధ్యంలో ఉన్న వాగు దాటాల్సిందే. మరో మార్గమే లేదు. దీంతో ఆ ప్రయత్నం చేయలేని పరిస్థితి. ఏం చేయాలో అర్ధం కాలేదు. బిడ్డ ఊపిరి పీల్చుకోవడంలో పడుతున్న అవస్థ పెరుగుతూపోతోంది. చేసేదేమీలేక నాటు వైద్యుడిని ఆశ్రయించాం. ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలనుకున్నాం. ఆ నాటు వైద్యుడు ఇచ్చిన పసర మందుని బిడ్డకు పట్టిచ్చాం. తల్లిపాల ద్వారా బిడ్డకు మందు అందుతుందన్న ఆశతో నేను (తల్లి రమ్య) కూడా నాటు మందు తీసుకున్నా. అయినా బిడ్డ పరిస్థితి మెరుగుప డలేదు. ఆదివారం రాత్రి వాగు ఉధృతి తగ్గడంతో కాలినడకన ఏడుగు రాళ్ళపల్లి ప్రాఽథమిక వైద్యశాలకు వెళ్లాం. అక్కడి నుంచి వైద్యులు చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చింతూరు నుంచి భద్రాచలం ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. చివరకు బిడ్డ ప్రాణాలు పోయాయంటూ ఆ తల్లిదండ్రులు రోఽధిస్తున్నారు.