Share News

డిస్టలరీలపై..సీఐడీ!

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:53 AM

వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్ర మాలను వెలికి తీసే పనిలో సీఐడీ దూకుడు పెంచింది. జిల్లాలోని డిస్టలరీలలో మంగళ వారం ఏకకాలంలో తనిఖీలు చేశారు.

డిస్టలరీలపై..సీఐడీ!
అనపర్తి మండలం కొప్పవరంలో డిస్టలరీ ఫ్యాక్టరీ

4 డిస్టలరీల్లో సోదాలు

కీలక దస్త్రాలు స్వాధీనం

నాటి అక్రమాలపై ఆరా

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ హయాంలో జరిగిన మద్యం అక్ర మాలను వెలికి తీసే పనిలో సీఐడీ దూకుడు పెంచింది. జిల్లాలోని డిస్టలరీలలో మంగళ వారం ఏకకాలంలో తనిఖీలు చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం విక్రయించే విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిం దే. మంచి బ్రాండ్లను ఆపేసి సొంతంగా మద్యం తయారుచేసి సొంత పేర్లతో నాసి రకం మద్యం విక్ర యించారు. డిజిటల్‌ లావా దేవీల ఊసే లేకుండా నగదు రూపంలో అ మ్మకాలు చేసి లెక్కపత్రం లేకుండా వైసీపీ పెద్దలు దోచుకున్నారు.జిల్లాలో నెలకు రూ.150 కోట్లకు పైగా వ్యాపారం జరిగేది. కూటమి అధి కారంలోకి రావడంతో మద్యం పాలసీని మార్చింది. దీంతో అప్పటి అక్రమాలపై దర్యా ప్తును సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గతంలో వ్యవహారం నడిపిన ఉన్నతస్థాయి అధికారుల మెడకు ఉచ్చు బిగి సింది.అసలు ఈ అక్రమాల వెనుక ఎవరు న్నారు.. ఎంత మేర అక్రమాలు జరిగాయనేది తేల్చడానికి సీఐడీ అధికారులు ఏకకాలంలో సోమవారం అన్ని చోట్ల సోదాలు మొదలు పెట్టారు.రాజమహేంద్రవరంలోని సీఐడీ రీజ నల్‌ ఆఫీసు నుంచి ఏఎస్పీ హస్మా ఫర్వీన్‌ ఆధ్వర్యంలో సీఐడీ డీఎస్పీలు, సీఐలు, ఇతర సిబ్బంది, ఎక్సయిజ్‌ అధికారులు తదితరులు తనిఖీలు చేస్తున్నారు. కానీ ఏవిధమైన సమా చారం బయటకు చెప్పడం లేదు. లోపలకు వెళ్లి గేట్లకు తాళాలు వేసి తనిఖీ చేస్తున్నారు. జిల్లాలో రంగంపేట మండలంలోని నల్ల మిల్లిలో ఫ్రాగ్‌ మద్యం పరిశ్రమ, కోటపా డులోని మద్యం బాట్లింగ్‌ యూనిట్‌, అనపర్తి మండలం కొప్పవరం బీడీహెచ్‌ ఆగ్రో వెం చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనూ తనిఖీలు జరు గుతున్నాయి. తాళ్లపూడి మండలం తుపాకుల గూడెంలో కూడా డిస్టిలరీ ఉంది. వైసీపీ హయాంలో భూంభూం బ్రాండ్‌ ఇక్కడ నుంచి వచ్చేదని సమాచారం. ఇక్కడ గతంలో ఏఏ బ్రాండ్లు తయారు చేసేవారు.. వైసీపీ హయాంలో ఏ బ్రాండ్లు తయారు చేశారు. ఎక్కడ నుంచి సరుకు వచ్చేది తదితర వివరాలు సేకరిస్తున్నారు. అప్పటి రికార్డులన్నీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. డిస్టిలరీల నిర్వా హకులను ఎక్కడికి కదలకుండా చేయడంతో పాటు అక్కడ పనిచేసేవారిని కూడా అదుపు చేసి వివరాలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. సీఐడీ అధి కారులు మాత్రం తాము చేస్తున్న సోదాల గురించి లీకులు ఇవ్వడంలేదు.

కొప్పవరంలో కీలక దస్త్రాలు..

అనపర్తి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : అనపర్తి మండలం కొప్పవరంలోని బీడీహెచ్‌ ఆగ్రోవెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థపై మంగళవారం సీబీఐ డీఎస్పీ భూపాల్‌ ఆధ్వ ర్యంలో సీఐడీ అధికారులు దాడులు చేశారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం వరకు సాగాయి. తనిఖీల వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరా కరించారు. దాడుల్లో పలు కీలకమైన సమాచా రం ఉన్న దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నియోజకవర్గం లోని మూడు డిస్టలరీలలోను గత నాలు గేళ్ళుగా మద్యం తయారీలేకుండా కేవలం బాట్లింగ్‌ యూనిట్లగానే వీటిని నిర్వహించి నట్టు సమాచారం.ట్యాంకర్ల ద్వారా వచ్చిన మద్యాన్ని ఇక్కడ ప్యాకింగ్‌ చేసి లేబుల్స్‌ అతి కించి పంపించడమే జరిగినట్టు సమాచారం.

రంగంపేటలోనూ తనిఖీలు..

రంగంపేట,ఆక్టోబరు 22 : రంగంపేట మం డలం కోటపాడు, నల్లమిల్లి బీరు ఫ్యాక్టరీలలో ఏకకాలంలో మంగళవారం ఉదయం 9 నుంచి అర్ధరాత్రి వరకూ విశాఖపట్నం నుంచి వచ్చిన సీఐడీ అధికారులు రెండు టీమ్‌లుగా ఏర్పడి సోదాలు చేశారు.సీఐడీ డిఎస్పీ కుమార్‌స్వామి ఆధ్వర్యంలో కోటపాడు బీరు ఫ్యాక్టరీ , సీఐడీ డిఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నల్లమిల్లి బీరు ఫ్యాక్టరీలోనూ గేట్లు తాళాలు వేసి ఎవరినీ లోపలికి అనుమతించకుండా సోదా లు చేశారు.గత వైసీపీ ప్రభుత్వం అధికాంలో ఉన్న 2019 నుండి 2024 వరకు జరిగిన మద్యం తయారీ, అమ్మకాలకు సంబంఽఽఽధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కోటపాడులో ఉన్న ఫ్యాక్టరీ నెలకు ఒకకోటి ఏబై లక్షల మద్యం సీసాలను తయారు చేసే సామర్ధ్యం కలిగిన ఫ్యాక్టరీ. సోదాల్లో మద్యం తయారీకి, అమ్మకాలకు భారీగా వ్యత్యాసం ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.ఫ్యాక్టరీలో ఉన్న రికార్డులను సీజ్‌ చేస్తున్నారని తెలిసింది. సోదాలు రెండో రోజు బుధవారం కొనసాగే అవకాశాలున్నాయి.

Updated Date - Oct 23 , 2024 | 12:53 AM