పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - Dec 06 , 2024 | 01:30 AM
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలను చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఉమమాహేశ్వరరావు డిమాండ్ చేశారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు
నల్లజర్ల, డిసెంబరు 6(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలను చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఉమమాహేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం నల్లజర్లలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్‌ను పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగులకు 22 వేల కోట్లు బకాయి ఉన్నట్టు చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చిన ఉద్యోగులను మోసం చేస్తునే ఉన్నారని విమర్శించారు. గతంలో వాడుకున్న విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలను దోచుకోవడం సిగ్గుచేటన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర రహదారులపై టోల్ టాక్స్ వసూలు చేసే నిర్ణయం సరికాదన్నారు. కార్యక్రమంలో యూటీ ఎఫ్ అధ్యక్షులు ఫకృద్దీన్,బి కిషోర్, కొక్కిరపాటి వెంకట్రావు, ఐవీ సత్యం, ఎస్‌ఎం ఆలీ సాహెబ్, సీహెచ్ మనోహర్‌కుమార్ పాల్గొన్నారు.