Share News

ఇళ్ల లబ్ధిదారులకు వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టండి

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:56 AM

పేదల ఇళ్ల నిర్మాణం ఈ డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు.

ఇళ్ల లబ్ధిదారులకు వాట్సాప్‌ గ్రూప్‌ పెట్టండి
అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌

రాజానగరం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : పేదల ఇళ్ల నిర్మాణం ఈ డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. రాజానగరం మండలం వెలుగుబంద పంచాయతీ పరిధిలోని హౌసింగ్‌ లేఅవుట్‌ను వివిధ శాఖల అధికారు లతో కలిసి శనివారం పరిశీలించి మాట్లాడారు. డిసెంబరు నెల చివరి నాటికి 2,333 ఇళ్ల నిర్మా ణం లక్ష్యం కాగా ఇప్పటివరకు 306 (13 శాతం) పూర్తి చేయడం జరిగిందన్నారు. నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆప్షన్‌ 3 కింద 3,396 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 683 పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయ న్నారు. పునాది స్ధాయిలో 56, బేస్‌మెంట్‌ పూర్తిచేసినవి 125, మిగిలిన వివిధ దశల్లో ఉన్నా యన్నారు. ప్రతి వారం లక్ష్య సాధన దిశగా కృషి చేయాలన్నారు. లబ్ధిదారులతో కూడిన వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్‌ అధికా రులకు ఆదేశించారు. బిల్లుల చెల్లింపు కోసం జియో ట్యాగింగ్‌ సమస్య ఉందని, వారికి సరైన విధానంలో మార్గదర్శకం చేయాలన్నారు. లబ్ధిదారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఒక్కరోజు లబ్ధిదారుల అర్జీలకు అం దుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించా రు. పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులు ఉండడం వల్ల కార్పొరేషన్‌ సిబ్బంది సహకారం అందిం చాలని ఇన్‌చార్జి హౌసింగ్‌ పీడీ కెఎల్‌ శివజ్యోతి విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ వెంట ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ బీవీ.గిరి, ఇతర జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌కు స్థల పరిశీలన

రాజమహేంద్రవరం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కలెక్టరేట్‌ శాశ్వత భవ నాల నిర్మాణానికి జాంపేటలోని పోలీసు క్వార్టర్‌ సమీపంలోని స్థలాలను కలెక్టర్‌ పి. ప్రశాంతి శనివారం అధికారులతో కలసి పరి శీలించారు. జిల్లాలు ఏర్పడి వచ్చే ఏప్రిల్‌ 2వ తేదీకి మూడేళ్లు పూర్తవుతునాన ఇప్పటి వరకు కలెక్టరేట్‌కు శాశ్వత భవనాలు లేవు. ప్రస్తుతం బొమ్మూరులోని నేక్‌ భవనాల్లోను, ఇతర భవనాల్లోను కార్యాలయాలు ఉన్నాయి. సొంత భవనాల నిర్మాణానికి జీవో జారీ అయ్యింది.ఈ నేపథంలో కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఆర్డీవో ఆర్‌.కృష్ణనాయక్‌, ఆర్‌అండ్‌బీ అధికారు లతో కలసి జాంపేట స్వామి థియేటర్‌ ఎదు రుగా ఉన్న సుమారు ఏడు ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.కలెక్టరేట్‌తో పాటు ఇతర కార్యా లయాలు శాశ్వతంగా నిర్మిస్తామన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:56 AM