బ్యాంకర్లు రుణాల లక్ష్యం చేరాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:10 AM
బ్యాంకర్లు రుణాలు మంజూరు లో ఉదారంగా వ్యవహరించాలని కలెక్టర్ ప్రశాం తి సూచించారు.
రాజమహేంద్రవరం రూరల్, డిసెంబరు 27 (ఆంధ్ర జ్యోతి): బ్యాంకర్లు రుణాలు మంజూరు లో ఉదారంగా వ్యవహరించాలని కలెక్టర్ ప్రశాం తి సూచించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన బ్యాంకర్లతో సమీక్షించా రు.2024-25 త్రైమాసిక ప్రణాళిక అమలు పురో గతి, వ్యవసాయ అనుబంధ రుణ ప్రణాళిక ప్రగతి విద్యా రుణాలు, టిడ్కో ఇంటి రుణాలు, వికసిత్ భారత్, విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకు రుణాలు తదితర అంశాలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రుణ ప్రణా ళికలో భాగంగా స్వల్ప కాలిక, టర్మ్ లోన్లు మెత్తం 11,106 లక్ష్యంకాగా 7201 మందికి రుణాలు మం జూరు చేశామన్నారు. కౌలు రైతులు 30,179 మం దికి సుమారు రూ.150.5 కోట్లు రుణాలు అంద జేశాన్నారు.20,515 డ్వాక్రా సంఘాలకు రూ. 1,421.56 కోట్ల లక్ష్యానికి 9478 గ్రూపులకు రూ. 592 కోట్లు (41.71)ధాతం మంజూరు చేసినట్టు చెప్పారు. నూతన పాలసీ ప్రకారం ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. లక్ష్యాలు సాధించని బ్యాంకర్లపై సీఈవోకి ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. నెల రోజుల అనంతరం బ్యాంకుల ప్రగతి నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు డీసీసీబీ, యుకో, కొటక్ తదితర బ్యాంకుల లక్ష్య సాధనలో వెనుక బాటుపై వివరణ కోరారు. రానున్న డిసిసి సమా వేశానికి ముఖ్యఅఽధికారులు హాజరు కావాలన్నా రు. సమావేశానికి హాజరైన వారికి సరైన అవగా హన లేకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ కన్వీనర్, డీజీఎం ఎ.విశ్వేశ్వరరావు, నాబార్టు ఏజీఎం వైఎస్ నాయు డు, ఆర్బీఐ ప్రతినిధి సీహెచ్.నవీన్ కుమార్, ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
ఇసుక రీచ్ నిర్వాహకులదే పర్యవేక్షణ బాధ్యత
రాజమహేంద్రవరం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ఇసుక రీచ్ నిర్వాహకులదే పర్యవేక్షణ బాధ్యత అని.. అక్రమ రవాణా చేస్తున్నవారిపై కేసులు వారే పెట్టాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. కలెక్ట రేట్‌లో శుక్రవారం జరిగిన ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 17 ఓపెన్ రీచ్‌లలో 1,46,249 మెట్రిక్ టన్ను ల ఇసుక అందుబాటులో ఉండగా ఇప్పటి వరకూ 47,755 మెట్రిక్ టన్నులు వినియో గించారన్నారు.మిగిలిన ఇసుక ఎంత ఉందో ఇరిగేషన్,మైన్స్, రెవెన్యూ, అధికారులు జాయింట్ యాక్షన్ పరిశీలించి నివేదిక ఇవ్వా లని ఆదేశించారు. చిడిపి -1, కాకరపర్రు-1, కుమారుదేవం 1,3, ములకల్లంక-1,2, కాటవరం ఓపెన్ రీచ్‌లలో నీరు ఉండడం పై జాయింట్ కమిటీ తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. డీసిల్టేషన్ ఎగువ ప్రాం తంలో ఇసుకతీతకు బోట్స్‌మన్ సొసైటీలకు ముందస్తు అనుమతులు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని ఇరిగేషన్ హెడ్‌వర్కు ఈఈని ఆదేశించారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక పంపిస్తామని స్పష్టం చేశారు.పట్టా భూముల్లో 30 దరఖాస్తులకు ఎన్‌వోసీ జారీ చేశామన్నారు. జిల్లాలో కొత్తగా ఆరు ఓపెన్ రీచ్‌లను గుర్తించామని, వాటిని జీయో గ్రాఫికల్ సంఖ్య ఆధారంగా అందుబాటులోకి తేవాలన్నారు. సమా వేశంలో జేసీ చిన్నరాముడు, ఏఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీవోలు పాల్గొన్నారు.
మన్మోహన్ సింగ్ మృతికి కలెక్టర్ సంతాపం
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి సంతాపం ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం మన్మోహన్ సింగ్ మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మాజీ ప్రధాని మనోహ్మన్ సింగ్ మృతి నేపథ్యంలో ఏడు రోజులు సంతాప దినాలుగా పాటించడం జరుగుతుందని చెప్పారు.