Share News

కొనసాగుతున్న రైళ్ల రద్దు

ABN , Publish Date - Sep 07 , 2024 | 01:42 AM

విజయవాడ ఎగువ ప్రాంతా లలో రైల్వేట్రాక్‌ భారీ వరదల కారణంగా దెబ్బతినడంతో సామర్లకోట మీదుగా అటు విశాఖ, ఇటు విజయవాడలకు పలు రైళ్ల రాకపోకలను రద్దుచేసిన కొన్ని రైళ్లను తిరిగి పునరుద్ధరించారు. ఇంకా మరి కొన్ని రైళ్లను రద్దు జాబితాలో ఇంకా కొన సా

కొనసాగుతున్న రైళ్ల రద్దు

సామర్లకోట, సెప్టెంబరు 6: విజయవాడ ఎగువ ప్రాంతా లలో రైల్వేట్రాక్‌ భారీ వరదల కారణంగా దెబ్బతినడంతో సామర్లకోట మీదుగా అటు విశాఖ, ఇటు విజయవాడలకు పలు రైళ్ల రాకపోకలను రద్దుచేసిన కొన్ని రైళ్లను తిరిగి పునరుద్ధరించారు. ఇంకా మరి కొన్ని రైళ్లను రద్దు జాబితాలో ఇంకా కొన సాగిస్తూ రైల్వే ఉన్నతాధికారులు రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నెం. 12737 గల కాకినాడ-లింగంపల్లి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ ముందుగా నిర్ధేశించన సమయం శుక్రవారంరాత్రి 7.10కు కాకుండా అర్ధరాత్రి 12.30కు రీషెడ్యూల్‌ చేసి కాకినాడ నుంచి బయలుదేరుతుందని సామర్లకోట స్టేషన్‌ సూపరింటె ండెంట్‌ ఎం.రమేష్‌ శుక్రవారంరాత్రి చెప్పారు. ఈమేరకు డిప్యూటీ సీవోఎం కె.మణికుమార్‌ (సికింద్రాబాద్‌) నుంచి ఉత్తర్వులు అందాయి. ఈనెల 7,8,9 తేదీల వరకూ రద్దు చేసిన రైళ్ల వివరాలను ఈవిధంగా ఉన్నాయి. విజయవాడ-రాజమండ్రి మధ్య నడిచే(07459) రైలు, భీమవరం-నిడదవోలు మధ్య నడిచే (07885) రైలు, రాజమండ్రి- విజయవాడ మధ్య నడిచే (07460) రైలు, భీమవరం-నిడద వోలు మధ్య నడిచే (07885) రైలు, నిడదవోలు-భీమవరం మధ్య నడిచే (07886) రైలు, నరసాపురం-నిడదవోలు- నరసా పురం మధ్య నడిచే రైలు (07673,07674), భీమవరం-నిడదవో లు-భీమవరం మధ్య నడిచే రైళ్లు (07772, 07882), విజయ వాడ-రాజమండ్రి- విజయవాడ మధ్య నడిచే రైళ్లు (07768, 07767) ఈనెల 7,8 తేదీలలో రద్దు చేశారు. కాకినాడ-విజయ వాడ మధ్య నడిచే రైలు (17258) ఈనెల 7,8,9 తేదీలలో రద్దు చేశారు. గురువారం విశాఖ- గుంటూరుల మధ్య సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 9వరకూ రద్దయ్యాయి. కాకినాడ-లింగం పల్లి- కాకినాడ మధ్య నడిచే (12737, 12738, 12775) రైలు, నాందేడ్‌-విశాఖ మధ్య నడిచే (20812) రైలు, విశాఖ-మహ బూబ్‌నగర్‌-విశాఖ మధ్య నడిచే (12861, 12862) రైళ్లు ఈనెల 5 నుంచి విజయవాడ సమీపాన రాయనపాడు స్టేషన్లో హాల్ట్‌ పాక్షికంగా ఎత్తివేశారు. ఈమేరకు రైల్వే ఎస్టీఎం చార్జ్‌ అధికారి రాజనరసు సామర్లకోట రైల్వే ఉన్నతాధికారులకు జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 01:42 AM