Share News

అవినీతి రహిత సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Oct 30 , 2024 | 12:53 AM

అవి నీతి రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం, పౌరులు, ప్రైవేట్‌ రంగాలు సమష్టి బాధ్యతగా గుర్తించాలని ఓఎన్జీసీ సీజీఎం సోమశేఖర్‌ పిలు పునిచ్చారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మంగళ వారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

అవినీతి రహిత సమాజమే లక్ష్యం
రాజానగరం సదస్సులో మాట్లాడుతున్న సోమశేఖర్‌

  • విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు

రాజానగరం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అవి నీతి రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వం, పౌరులు, ప్రైవేట్‌ రంగాలు సమష్టి బాధ్యతగా గుర్తించాలని ఓఎన్జీసీ సీజీఎం సోమశేఖర్‌ పిలు పునిచ్చారు. విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మంగళ వారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. భారత భవిష్యత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర వహించాలని, అవినీతి వ్యతిరేక పోరాటంలో కట్టుబడి ఉండా లని పేర్కొన్నారు. విద్యార్థులు నైతిక విలువలతో నడుచుకోవాలన్నారు. మరో ముఖ్యఅతిథి ఓఎన్జీసీ సీజీఎం భాస్కర్‌ మాట్లాడుతూ అక్టోబరు 28 నుంచి నవంబరు 3వరకు నిర్వహించే ఓఎన్జీసీ విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాల్లో భాగంగా వి ద్యార్థుల్లో అవినీతి వ్యతిరేక స్ఫూర్తి కలిగించేం దుకు వివిధ పోటీలు, చైతన్య సదస్సులు నిర్వహి స్తున్నామన్నారు. అనంతరం అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడుతూ ప్రతిజ్ఞ చేశారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జీజీయూ డైరెక్టర్‌ పీఆర్‌కే రాజు, ఓఎన్జీసీ డీజీఎం ఎం.శ్రీనివాస్‌, గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎంవీఎస్‌ బాబు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 12:53 AM