ప్రజల పక్షాన సీపీఐ
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:42 AM
రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సీపీఐ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల తరపున పోరాటం సాగిస్తామని ఆయన వెల్లడించారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా శనివారం తూర్పు
31 వరకూ సీపీఐ 100వ ఆవిర్భావ దినోత్సవ సభలు
రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సీపీఐ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల తరపున పోరాటం సాగిస్తామని ఆయన వెల్లడించారు. సీపీఐ శత వసంతాల సందర్భంగా శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్యమైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మత తత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలన్నారు. వందేళ్ల భారత దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటామని, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ వరకూ సీపీఐ 100వ ఆవిర్భావ దినోత్సవ సభలు జరుగుతాయని తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, నగర కార్యదర్శి కొండలరావు, జట్లు లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, జిల్లా కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.