ప్రమాదకర స్థితిలో దిండి-చించినాడ బ్రిడ్జి
ABN , Publish Date - Jul 12 , 2024 | 12:36 AM
ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ఠ నదిపై దిండి-చించినాడ మధ్య వంతెన నిర్మించిన 24 సంవత్సరాలు గడిచినా నేషనల్ హైవే అధికారులు పట్టించుకోకపోవడంతో మానవతామూర్తుల సామాజికసేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు.
మలికిపురం, జూలై 11: ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ఠ నదిపై దిండి-చించినాడ మధ్య వంతెన నిర్మించిన 24 సంవత్సరాలు గడిచినా నేషనల్ హైవే అధికారులు పట్టించుకోకపోవడంతో మానవతామూర్తుల సామాజికసేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఏడాది క్రితం ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేయగా అప్పటి అధికారులు కంటితుడుపు చర్యగా కొద్దిపాటి మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. ఏడాదికే వంతెన మరలా యథాస్థితికి రావడంతో మానవతామూర్తులు సామాజికసేవా సంస్థ మరోసారి ఆందోళన చేపట్టింది. స్పందించిన నేషనల్ హైవే అధికారులు జీవన్ (ప్రాజెక్టు లైనర్), ప్రాజెక్టు మేనేజరు గోపాల్‌కిరణ్, అధికారుల సమక్షంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. సభ్యులు అడ్డుకోగా వర్షాకాలం తర్వాత అక్టోబరు నెలలో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి నూతన లైటింగ్ విధానం ఏర్పరిచి పోలీసుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి సమస్యను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. బోనం రాజు, ఎంవీ సత్యవాణి, ఎం.రాము, ఎం.శ్రీనివాసరాజు, నల్లి మోహన మాస్టారు పాల్గొన్నారు.