దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Dec 09 , 2024 | 01:16 AM
పిఠాపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా శ్రీపాదశ్రీవల్లభుల జన్మస్థానంగా ప్రాచుర్యం పొందిన కాకినాడ జిల్లా పిఠాపురం లోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహాగణపతిపూజ, కలశస్థాపన, శ్రీపాదశ్రీవల్లభుల మహిమాన్విత దివ్య
తొలిరోజు సర్వపుష్ప పూజ
పిఠాపురం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా శ్రీపాదశ్రీవల్లభుల జన్మస్థానంగా ప్రాచుర్యం పొందిన కాకినాడ జిల్లా పిఠాపురం లోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహాగణపతిపూజ, కలశస్థాపన, శ్రీపాదశ్రీవల్లభుల మహిమాన్విత దివ్య పాదపద్మములకు మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, శ్రీసూక్త, పురుషసూక్తములతో సహస్ర నామార్చన, మంగళహారతి, మంత్రపుష్పము, వేదపారాయణ, రుత్విక్కులచే మూలమంత్ర అనుష్టానం, గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్ పారాయణ, గురుచరిత్ర, శ్రీపాదశ్రీవల్లభ చరితామృత పారాయణ జరిగాయి. సాయంత్రం అగ్నిప్రతిష్టాపన, దత్తమంత్ర హోమం, శ్రీపాదశ్రీవల్లభుల దివ్యపాదపద్మములకు వివిధ హారతు లు, స్వామివారికి పల్లకిసేవ, సాయంకాలార్చన నిర్వహించారు. అంతకు ముందు ఉదయం దత్తాత్రేయస్వామి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. పురవీధుల్లో ఉత్సవం సాగింది. సర్వపుష్ప అ నంతరం శ్రీపాదశ్రీవల్లభులు, దత్తాత్రేయస్వామి, నృసింహ సరస్వతులను ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాల తొలిరోజు మహారాష్ట్ర, ఉభయ తెలుగురాష్ట్రాలు, కర్నాటక నుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు. కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి సౌజన్య తదితరులన్నారు.
పాదగయలో నేటి నుంచి...
పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో స్వయంభువమూర్తిగా వెలసిన దత్తాత్రేయస్వామి దత్తజయంతి సప్తాహ మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వేదోక్త విధిననుసరించి దత్తాత్రేయ మంత్రానుష్టానము, హోమములు, గురుచరిత్ర పారాయణము, వేదపారాయణ, యతిపూజ, లక్ష బిల్వార్చన, సత్యదత్త వ్రతాదులతో సప్తాహదీక్షతో ఉత్సవాలు నిర్వహిస్తారు. డిసెంబరు 15 వరకూ జరిగే ఉత్సవాల్లో రోజూ మహాగణపతిపూజ, కలశస్థాపనలు, రుత్విక్‌వరణములు, పంచామృతాభిషేక సహిత రుద్రాభిషేకం, సహస్ర నామార్చన, మంగళహారతి, మంత్రపుష్పము, రుత్విక్కులతో దత్తమాల మం త్ర అనుష్టానం, గురుచరిత్ర పారాయణ, వేదపారాయణ, గణపతి అథర్వశీర్ష ఉపనిషత్ పారాయణ, విష్ణు, లలితా సహస్రనామ పారాయణ లు, మధ్యాహ్నం 3గంటలకు అగ్నిప్రతిష్టాపన, దత్తమూల మంత్రహోమాదులు, సాయంత్రం సాయంకాల విశేష పుష్పార్చన జరుగుతాయి.