Share News

రాక్షసదారులు

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:47 AM

రోడ్డు ప్రమాదమంటే ఒక వ్యక్తి మరణమో, లేదా కొందరు క్షతగాత్రులుగా మిగలడం కాదు.. ఏదైనా ప్రమాదంలో కుటుంబాలకు ఆధారమైన వారు చనిపోతే.. ఇక ఆ కుటుంబాలకు దిక్కులే కుండాపోతుంది.

రాక్షసదారులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

రోడ్డు ప్రమాదమంటే ఒక వ్యక్తి మరణమో, లేదా కొందరు క్షతగాత్రులుగా మిగలడం కాదు.. ఏదైనా ప్రమాదంలో కుటుంబాలకు ఆధారమైన వారు చనిపోతే.. ఇక ఆ కుటుంబాలకు దిక్కులే కుండాపోతుంది. అప్పటిదాకా సంతోషంగా సాగిపో తున్న వారి జీవితాలు అల్లకల్లోలమైపోతాయి. పిల్ల లు అనాథలైపోతారు. నిత్యం ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతుండగా, మరెంతో మంది తీవ్రంగా గాయపడి మంచానపడుతున్నారు. అప్పు డు కూడా ఆ కష్టాన్ని భరించాల్సింది వారి కుటుం బమే. ఇలా బాధిత కుటుంబాలు చిన్నాభిన్నమౌతున్నాయి. కొందరి నిర్లక్ష్యం, నిద్రమత్తు, మద్యం, అతి వేగం, రోడ్లు ఛిద్రమై ప్రమాదాలు జరుగుతున్నాయి. జరుగుతుంటే మరి కొన్ని ప్రమాదాలు రహదారులు ఛిద్రమై గోతులమయం కావడంతో జరుగుతున్నాయి. కారణమేదైనా మూల్యం మాత్రం బాధి తులతోపాటు వారి కుటుంబాలు మోస్తున్నాయి.

ఫ మృత్యు కేంద్రాలు.. బ్లాక్‌ స్పాట్స్‌

రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా జాతీయ రహ దారుల్లోనే జరుగుతుంటాయి. దానికి కారణాలు అనేకం. ఇలా తరచు ప్రమాదాలు జరిగే ప్రాంతా లను బ్లాక్‌ స్పాట్లుగా పరిగణిస్తారు. చివరి మూడేళ్ల లో రోడ్డులోని 500 మీటర్ల నిడివి (స్ట్రెచ్‌)లో ప్రమా దాలు జరిగి 5 మరణాలు లేదా 10 మరణాలు లేదా అదే సంఖ్యలో ప్రమాదాలు సంభవిస్తే అక్కడ పలు శాఖలకు చెందిన అధికారులు సర్వే చేసి బ్లాక్‌ స్పాట్‌గా గుర్తిస్తారు. దీంతో ఆ ప్రాంతంలో కచ్చితంగా రక్షణ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. బ్లాక్‌స్పాట్‌గా గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వా నికి నివేదిక పంపిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సవ్యంగా సాగితే బ్లాక్‌ స్పాట్‌గా కేంద్రం రిజిస్టర్‌ చేస్తుంది. వెంటనే ఆ ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టడానికి రూ.25 లక్షలు విడుదల చేస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కొంత జత చేయడం ద్వారా తక్షణ రక్షణ చర్యలు చేపట్టి సూచన, హెచ్చరిక బో ర్డులు, రంబుల్‌ స్ట్రిప్స్‌, క్యాట్‌ఐవ్స్‌ (రిఫ్లెక్టింగ్‌ స్టడ్స్‌), ధర్మోప్లాస్టిక్‌ రోడ్‌ మార్కింగ్స్‌, స్పీడ్‌ బ్రేకర్లు, సరి పడా లైటింగ్‌, ముందు కొంత దూరంలో బ్లాక్‌ స్పా ట్‌ ఉందని.. వేగం నియంత్రించుకొని జాగ్రత్తగా వెళ్లాలనే బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ఫ ప్రమాదాలకు కారణాలివేనా..

బ్లాక్‌స్పాట్లు గుర్తించిన తర్వాత ప్రధానంగా ఆర్‌ అండ్‌బీ, నేషనల్‌ హైవేస్‌, విద్యుత్తు, ఆర్టీఏ, మునిసి పల్‌ కార్పొరేషన్‌, పోలీస్‌ విభాగాల పాత్ర ఎక్కు వగా ఉంటుంది. అవసరమైన విద్యుత్తు, రోడ్డు మా ర్కింగులు, బోర్డుల ఏర్పాటు ఆ శాఖల పనే. పోలీ సులు ఆయాచోట్ల స్టాపర్‌ బోర్డులు వంటివి ఏర్పా టుచేయడం, సిబ్బందిని కాపలాగా ఉంచడం చేస్తా రు. శాఖల మధ్య సమన్వయ లోపం, ఆయా శాఖ లు చేయాల్సిన రక్షణ పనుల్లో తీవ్ర అలసత్వం వల్ల బ్లాక్‌ స్పాట్లు మరిన్ని ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. అలాగే.. వాహన చోదకుల మితిమీరినతనం కూడా ప్రాణాలు కోల్పోయేలా చేస్తోంది. అతివేగం, నిద్ర మత్తు, వచ్చీరాని డ్రైవింగ్‌, మద్యం సేవించి నడప డం, మలుపుల్లో, ఏదైనా అకస్మాత్తుగా ఎదురైతే అదుపు చేసుకోలేకపోవడం, రాంగ్‌రూట్‌లో వెళ్లడం, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన లేకపోవడం, అవగాహన ఉన్నా నిర్లక్ష్యం, వాహనాలు కండీషన ల్‌లో లేకపోవడం, రాత్రి వేళల్లో హైవేపై వాహనా లు నిలిపినా భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం వంటి కారణాలు ప్రజల ఊపిరిని ఆపేస్తున్నాయి.

ఫ ఏం చెయ్యొచ్చు

జాతీయ రహదారులు లేదా రెండు లేన్లు, సింగి ల్‌లేన్‌(వరుస) రోడ్లపై స్పీడుగా వెళ్లే, నింపాదిగా వెళ్లే, ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు, కార్లు ఏవి ఏ లేనులో వెళ్లాలో ఇప్పటికీ అధికశాతం మం ది వాహనదారులకు అవగాహన లేదు. దీనిపై విస్తృతంగా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. టోల్‌గేట్ల వద్ద ఫోన్‌ నంబరు తీసుకొని ఆయా వాహనదారులను అప్రమత్తం చేసేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణపై మెసేజ్‌లను పంపొచ్చు. హెల్మెట్‌, సీటుబెల్టు తప్పనిసరిగా ధరించే విధంగా ప్రజలకు అవగాహన కలిగించవచ్చు. అతి వేగంగా వెళ్లేవాళ్లకు కౌన్సెలింగ్‌, అవసరమైతే కేసులు నమో దు చేయాలి. రోడ్లపై ఇష్టానుసారం పార్కింగ్‌ చేసే వాహనాలపై కఠినంగా వ్యవహరించవచ్చు. రోడ్ల పక్కన ప్రమాద నివారణ సూచన, హెచ్చరిక బోర్డు లను విస్త్రతంగా ఏర్పాటుచేయాలి. గతంలో రాత్రి 12 గంటల నుంచి వాహన డ్రైవర్లను పోలీసులు గమనించేవారు. 2గంటల నుంచి ఉదయం 5 గం టల మధ్య డ్రైవర్ల ముఖాన్ని నీటితో కడిగించడం చేయించేవారు. సిబ్బంది కొరత వేధిస్తున్న పోలీసు శాఖకు ఇలాంటివి వీలుపడడం లేదని తెలుస్తోంది.

కాకినాడ జిల్లాలో పది నెలల్లో 235 మృతులు

కాకినాడ క్రైం నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది జనవరి నెల నుంచి అక్టోబరు నెల వరకు జిల్లావ్యాప్తంగా 220 ఘోర ప్రమాదాలు చోటుచేసుకోగా 235 మంది మృత్యువాతపడ్డారు. వారిలో 204 మంది పురుషులుకాగా 31 మంది మహిళలు. అలాగే మరో 97 రోడ్డు ప్రమాదాల్లో 134 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అలాగే 348 ప్రమాదాల్లో 656 మంది గాయాలపాలయ్యారు. గత ప్రభుత్వం ఛిద్రమైన రహదారుల పట్ల శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో పెద్ద సంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయని పలు ప్రజాసంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్దను రోడ్డు ప్రమాదాలు మింగేస్తుంటే ఆయా కుటుంబాలు రోడ్డునపడి తేరుకోలేకపోతున్నాయి. బాధిత కుటుంబాల ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోయి దీనస్ధితిలోకి వెళ్లిపోతున్నారు. అనేకమంది భార్యాభర్తలు చనిపోయి పిల్లలు అనాథలవుతున్నారు. ఈ ప్రమాద విషాదాలు ఆయా కుటుంబాలను జీవితాంతం వెంటాడుతున్నాయి. కాగా కాకినాడ జిల్లా పోలీసులు ఎస్పీ విక్రాంత్‌పాఠిల్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న రహదారుల్లో 55 బ్లాక్‌స్పాట్లను గుర్తించి నిరంతర భద్రతను ఏర్పాటుచేశారు. అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

నిరాశ్రయులుగా.. మిగిలిపోయారు!

(తుని రూరల్‌/ఆంధ్రజ్యోతి)

2024 జనవరి 30న తేటగుంట హైవే కూడలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తేటగుంటకు చెందిన గొర్ల నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆంధ్రజ్యోతి పలకరించింది. రోజువారీ కూలీగా ఉన్న నాగేశ్వరరావుపై భార్య, ముగ్గురు పిల్లలు, ఆయన తల్లి ఆధారపడి జీవించేవారు. ప్రమాదంలో ఇంటి యజమాని మరణించడంతో కుటుంబ మొత్తం నిరాశ్రయులుగా మిగిలామని వారు చెప్పారు. బీమాగానీ, ఆర్థిక సాయంగానీ అందకపోవడంతో భార్య పాపార త్నం రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషిస్తోంది.

‘తూర్పు’లో పది నెలల్లో 243 మంది మృతి.. 626 మంది క్షతగాత్రులు

తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నా యి. జాతీయ రహదారుల పరిధి ఉన్న ఆయా పోలీస్‌ స్టేషన్ల అధికారులకు రోడ్డు ప్రమాదాల కేసుల నమోదు, దర్యాప్తు, విచారణలు ప్రహస నంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివ రకూ గణాంకాలు పరిశీలిస్తే జిల్లాలోని 595 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా ఏకంగా 243 మంది ప్రాణాలు బలైపోయాయి. 626 మంది ఆస్పత్రి పాలయ్యారు. రాజానగరం, బొమ్మూరు, దేవరాపల్లి, నల్లజర్ల పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ 10 నెలల్లో 110 మంది విగత జీవులయ్యారు. ఇంచుమించు జాతీయ రహదార్లతో రాష్ట్ర రహ దారులు ప్రమాదాల్లో పోటీపడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లోని మరణాలు కుటుంబ సభ్యులను నిర్జీవంగా చేస్తుంటే.. గాయాలపాలైన వాళ్లలో చాలామంది మంచానికి, వీల్‌చైర్లకు పరిమితమై జీవితమంతా నరకం చూస్తున్నారు.

మురారి-నీలాద్రిరావుపేట పరిధిలో ఎక్కువ ప్రమాదాలు

గండేపల్లి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): గండేపల్లి మండలంలో మురారి గ్రామం నుంచి నీలాద్రిరావుపేట గ్రామం వరకు సుమారు 19 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మల్లేపల్లి గ్రామ శివారులో కొన్నేళ్ల క్రితం పశ్చిమగోదావరికి చెందిన ఐదుగురు కళాకారులు మృతిచెందారు. ఇటీవల మురారి గ్రామ శివారులో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన ముగ్గురు అన్నాదమ్ములు మృతిచెందారు. అలాగే తెలంగాణకు చెందిన బావాబామ్మర్దులు ఇటీవల మృత్యువాతపడ్డారు.

ప్రమాదాలు జరిగే స్పాట్‌లు

మురారి నుంచి నీలాద్రిరావుపేట వరకు ఏడు గ్రామాలుండగా 15కి పైగా డివైడర్లు ఉన్నాయి. మురారి, మల్లేపల్లి, గండేపల్లి, జడ్‌.రాగంపేట, తాళ్లూరు డివైడర్ల వద్ద మలుపులు ఎక్కువగా ఉం డడంతో గ్రామస్తులు వాహనాలు గమనించకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రివేళల్లో హైవేపై విద్యుత్‌ లైట్లు వెలగకపోవడం, దాబా రెస్టారెంట్ల వద్ద వాహనాలు నిలిపివేయడం, వర్షాకాలంలో గోతుల్లోకి నీరు చేరడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

గస్తీ ముమ్మరం చేశాం

రాత్రి వేళల్లో హైవేపై గస్తీ ముమ్మరం చేశాం. నో పార్కింగ్‌ ప్రాంతాల్లో వాహనాలు నిలుపుదల చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే బ్లాక్‌స్పాట్‌లు గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టిస్తున్నాం.

రోడ్డున పడ్డ కుటుంబాలు

ప్రత్తిపాడు,నవంబరు16(ఆంధ్రజ్యోతి):నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో 16 కిలోమీటర్ల పైబడి జాతీయ రహదారి విస్తరించింది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మృత్యువాత పడ్డారు. 50 మంది గాయపడ్డారు. ముఖ్యంగా పాదాలమ్మ తల్లి గుడి వద్ద ముగ్గురు లారీ డ్రైవర్లపై రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లిన ఘటనలో ముగ్గురు డ్రైవర్లు అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే గుడి వద్ద పని చేసే వ్యక్తిని కూడా అదే బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. గోవిందపురం కొండ జంక్షన్‌, నరేంద్రగిరి జంక్షన్‌, చెక్‌పోస్టు సెంటర్‌, సుద్దగడ్డ బ్రిడ్జి, రాచపల్లి అడ్డురోడ్డు, ధర్మవరం బైపాస్‌ సెంటర్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ సెంటర్‌, నిడిగట్ల వంతెన సెంటర్లలో ఎందరో మృతిచెందారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Updated Date - Nov 17 , 2024 | 12:48 AM