Share News

బాణసంచా విక్రయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు

ABN , Publish Date - Oct 24 , 2024 | 12:36 AM

బాణసంచా విక్రయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని అమలాపురం ఆర్డీవో కె.మాధవి హెచ్చరించారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం దీపావళి పండుగ నేపథ్యంలో భద్రతా అంశాలపై రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక, కార్మికశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

బాణసంచా విక్రయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు
మాట్లాడుతున్న ఆర్డీవో మాధవి

అమలాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): బాణసంచా విక్రయాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని అమలాపురం ఆర్డీవో కె.మాధవి హెచ్చరించారు. ఆర్డీవో కార్యాలయంలో బుధవారం దీపావళి పండుగ నేపథ్యంలో భద్రతా అంశాలపై రెవెన్యూ, పోలీస్‌, అగ్నిమాపక, కార్మికశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ దీపావళి బాణసంచా తయారీదారులు, విక్రయదారులు సురక్షితమైన వాతావరణంలో విక్రయాలు జరుపుకునేలా అన్ని ప్రామాణిక భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు చేపడతామన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో వృద్ధులు, మహిళలు, బాలలతో పనులు చేయించరాదని, శిక్షణ పొందిన కార్మికులను మాత్రమే నియమించుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇసుక, నీరు, అగ్నిమాపక పరికరాలు విధిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనుమతించిన ప్రదేశాల్లో నిర్దేశించిన సమయాల్లో మాత్రమే బాణసంచా విక్రయాలను జరుపుకోవాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్‌, పోలీసు అధికారులు విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టాలన్నారు. అక్రమంగా బాణసంచా నిల్వచేసిన, తయారుచేసినా పోలీసు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించాలని ప్రజలను ఆర్డీవో కోరారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి ప్రసాద్‌, అధికారులు, బాణసంచా విక్రయదారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 12:36 AM