Share News

డిగ్రీ ఫలితాల్లో ఆర్ట్స్‌ కళాశాల రికార్డు

ABN , Publish Date - May 24 , 2024 | 01:19 AM

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ 6వ సెమిస్టర్‌ ఫలితాల్లో సరికొత్త రికార్డు సాధించిందని, పరీక్షలు పూర్తయిన పది రోజులకే ఫలితాలను ప్రకటించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ రామచంద్ర ఆర్‌కే తెలిపారు.

డిగ్రీ ఫలితాల్లో ఆర్ట్స్‌ కళాశాల రికార్డు

ఫైనలియర్‌లో 90.7 శాతం విద్యార్థులు పాస్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 23 : రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల డిగ్రీ 6వ సెమిస్టర్‌ ఫలితాల్లో సరికొత్త రికార్డు సాధించిందని, పరీక్షలు పూర్తయిన పది రోజులకే ఫలితాలను ప్రకటించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్‌ రామచంద్ర ఆర్‌కే తెలిపారు. ఈ మేరకు గురువారం జోన్‌-1, 2 రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శోభారాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ డిగ్రీ ఫైనలియర్‌లో 90.7 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. అధ్యాపక సిబ్బంది కృషితో అద్భుత విజయం సాఽధ్యమైందన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభించనున్న వినూత్న సింగిల్‌ మేజర్‌, సర్టిఫికెట్‌ కోర్సులపై ఆర్‌జేడీ శోభారాణి సమీక్షించారు.ఈ కార్యక్రమంలో అకడమిక్‌ సమన్వయకర్త డి.సంజీవ్‌కుమార్‌, ఐక్యూఏసీ సమన్వయకర్త ఏ.అన్నపూర్ణ, పరీక్షల నియంత్రణాధికారి పి.బాబ్జీ, ఎన్‌ఆర్‌సీ కో ఆర్డినేటర్‌ సీహెచ్‌ సంజీవ్‌కుమార్‌, స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్యులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 07:36 AM