కోరుపల్లిలో డెంగీ
ABN , Publish Date - Nov 18 , 2024 | 01:06 AM
జిల్లాను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. ఎవరి నోట విన్నా ఒకటే మాట.. టైపాయిడ్.. వైరల్ బజ్వరాలే. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరంతో ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు.
ప్రైవేటు ఆసుపత్రులకు పరుగు
ఇద్దరు విద్యార్థులకు చికిత్స
ఆసుపత్రిలో మరో ఇద్దరు
భయం..భయంగా జనం
పట్టించుకోని అధికారులు
నిడదవోలు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. ఎవరి నోట విన్నా ఒకటే మాట.. టైపాయిడ్.. వైరల్ బజ్వరాలే. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జ్వరంతో ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు. వాతావరణంలో వచ్చి న మార్పులతో సతమతమవుతున్నారు. చిన్నా రులైతే దగ్గు, జ్వరం తదితర సమస్యలతో ఇబ్బం దిపడుతున్నారు. ఇదిలా ఉండగా డెంగీ జ్వరా లతో జనం అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో అపరి శుభ్రత కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామస్థాయి అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు అపరిశుభ్రతకు నిల యా లుగా మారిపోతున్నాయి. డెంగీ వంటి ప్రమా దకరమైన జ్వరాల బారిన పడినా అధికారుల్లో చలనం లేకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. నిడదవోలు మండలం కోరుపల్లి గ్రామ జనాభా సుమారు మూడు వేలు.. ఈ గ్రామంలో నివశించే వారిలో ఎక్కువ శాతం ప్రజలు పేదవర్గాలకు చెందిన వారే. గ్రామంలో అపారి శుధ్యం తాండవిస్తోంది.ఈ నేపథ్యంలో గత కొద్ది వారాలుగా పదుల సంఖ్యలో ప్రజలు డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారని సమాచారం. ఇటీవల గ్రామంలో 8వ తరగతి చదువుతున్న బాలిక డెంగీ బారిన పడిన తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఇది జరిగి వారం గడవక ముందే 35 ఏళ్ల వయసు కలిగిన మరొక వ్యక్తి డెంగీ బారిన పడి అదే ఆసుపత్రిలో చికిత్స పొందాడు. 7వ తరగతి చదువుతున్న విద్యార్థి డెంగీ జ్వరం కారణంగా ప్లేట్‌లెట్స్ పడిపోయి నిడదవోలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొం దాడు. గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో ప్రజలు ఎక్కువగా డెంగీ జ్వరాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఇదే గ్రామానికి చెందిన ఒకరు నిడద వోలు ప్రభుత్వ ఆసుపత్రిలో, మరొకరు తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా మారిపో యినా పంచాయితీ కార్యదర్శి దృష్టి సారించడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దీనిపై కోరుపల్లి పంచాయతీ కార్యదర్శి మెరిపో వెం కటేష్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయ త్నించగా స్పందించలేదు.జిల్లా ఉన్నతాధికా రు లు కోరుపల్లిలో పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని బీసీ, ఎస్సీ కాలనీల్లో ప్రజలు కోరుతున్నారు.