Share News

Pawan Kalyan: వినాయక చవితి పండుగపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:23 PM

వినాయక చవితి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) రాష్ట్ర ప్రజలకు కీలక సూచన చేశారు. పర్యావరణ హితంగా వినాయక చవితి నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Pawan Kalyan: వినాయక చవితి పండుగపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Pawan Kalyan

అమరావతి: వినాయక చవితి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) రాష్ట్ర ప్రజలకు కీలక సూచన చేశారు. పర్యావరణ హితంగా వినాయక చవితి నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వినాయక చవితిని మట్టి వినాయకులే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలని కోరారు. కాగా పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు.


‘‘మన వేడుకలు ఉత్సవాల్లో పర్యావరణ హిత వస్తువులను వాడడం మేలు. వినాయక చవితి వేడుకల్లోనూ మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం. దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపరుతో చేసిన కవర్లతో ఇవ్వడం సరికాదు. ప్రసాదాలను ప్లాస్టిర్ కవర్లల్లో కాకుండా తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలను వాడాలి. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల్లో ప్రయోగత్మాకంగా చేపడతాం’’ అని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అన్నారు.


కాగా వినాయక చవిత సమీపిస్తోంది. సెప్టెంబర్ 7న పండుగ జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో దేశవ్యాప్తంగా ఈ పండుగ వేడుకలు ఏవిధంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Updated Date - Jul 08 , 2024 | 05:23 PM