Share News

Pawan Kalyan: జనసేన జెండా పట్టుకొని ఇంటి ముందు నిలుచున్న బాలుడు.. కాన్వాయ్ ఆపిన డిప్యూటీ సీఎం పవన్

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:56 PM

కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడవ రోజు పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఉప్పాడలో కోతకు గురవుతున్న సముద్ర తీరాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాన్వాయ్ ఒకచోట అకస్మాత్తుగా ఆగింది.

Pawan Kalyan: జనసేన జెండా పట్టుకొని ఇంటి ముందు నిలుచున్న బాలుడు.. కాన్వాయ్ ఆపిన డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan

కాకినాడ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడవ రోజు పర్యటనలో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఉప్పాడలో కోతకు గురవుతున్న సముద్ర తీరాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న కాన్వాయ్ ఒకచోట అకస్మాత్తుగా ఆగింది. అనూహ్యంగా పవన్ కల్యాణ్ కూడా కిందకు దిగడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆసక్తికరమైన ఈ ఘటనకు ఒక బుడ్డొడు కారణమయ్యాడు.

అటుగా పవన్ కల్యాణ్ కాన్వాయ్ వెళ్తుండగా.. తన ఇంటి ముందు నిలుచొని ఆ బాలుడు ఊత్సాహంతో జనసేన జెండాను ఊపుతూ కనిపించాడు. బుడ్డోడిని గమనించిన డిప్యూటీ సీఎం వెంటనే కాన్వాయ్‌ని ఆపించారు. కారు దిగి బాలుడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని కాసేపు ముచ్చటించారు. స్థానికులు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు. దీంతో స్థానికులు అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ చాలా సింప్లీసిటీని ప్రదర్శించారని, చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉందని చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉప్పాడ వెళ్లే దారిలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.


కాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముచ్చటగా మూడవ రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ (బుధవారం) ఉప్పాడలో కోతకు గురైన సముద్ర తీరాన్ని పరిశీంచనున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ధ మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో వారాహి బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ ధన్యవాద ప్రసంగం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి విజయవాడకు పయనమవుతారు.


కాగా ఉప్పాడ తీరం భారీగా కోతకు గురవుతోంది. గత ఏడాదిన్నర కాలంగా ఏకంగా ఎకరం మేర భూభాగం సముద్రంలో కలిసిపోయింది. తీరం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ కోతను ఆపేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ ఇప్పటికే చెప్పారు. బుధవారం చెన్నై నుంచి వచ్చే నిపుణుల బృందం ఉప్పాడ తీరాన్ని పరిశీలించి దాన్ని రక్షణకు అవసరమైన చర్యలు సూచిస్తుందని, తదనుగుణంగా తీర సంరక్షణ చేపడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - Jul 03 , 2024 | 03:10 PM