Share News

మహోన్నతుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి

ABN , Publish Date - Nov 02 , 2024 | 12:24 AM

సామర్లకోట, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలుగు చలన చిత్ర రంగా నికి సుమధుర గేయాలను అందించిన మహాకవి, మహోన్న తుడు దేవులపల్లి కృష్ణశాస్తి చిరస్మరణీయు డని సామర్లకోట తహశీల్దార్‌ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కృష్ణశాస్త్రి 127వ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన రావువారి చంద్రంపాలెం గ్రా

మహోన్నతుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి
దేవులపల్లి విగ్రహానికి నివాళులర్పిస్తున్న తహశీల్దార్‌

సామర్లకోట, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలుగు చలన చిత్ర రంగా నికి సుమధుర గేయాలను అందించిన మహాకవి, మహోన్న తుడు దేవులపల్లి కృష్ణశాస్తి చిరస్మరణీయు డని సామర్లకోట తహశీల్దార్‌ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి అన్నారు. కృష్ణశాస్త్రి 127వ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన రావువారి చంద్రంపాలెం గ్రామంలో దేవుల పల్లి కృష్ణశాస్త్రి మండలపరిషత్‌ పాఠశాల ఆవరణలో ఆయన విగ్రహం వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్‌ కార్యదర్శి శీలామంతుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహశీల్దార్‌ హాజరై దేవులపల్లి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో ఘన సత్కా రాలు అందుకున్న దేవులపల్లి మనప్రాంతానికి చెందిన వారుకావడం మనం ఎంతో గర్వించ దగ్గ విషయన్నారు. సర్పంచ్‌ చీమల భవాని, డేగల బూరిబాబు, తలాటం బాబులు, దమ్మాల బాబ్జీ, పేరాబత్తుల నాగేశ్వరరా వు, తలారి సూరిబాబు, గొర్రెల అచ్చారావు, గంగబాబు, సూరిబాబు, తదితర ఉపాధ్యాయులు కృష్ణశాస్త్రి విగ్రహానికి పుష్పాభిషేకం చేశారు.

Updated Date - Nov 02 , 2024 | 12:24 AM