Share News

జిల్లాలో 44.02 లక్షల పనిదినాలు పూర్తి : డ్వామా పీడీ

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:27 AM

మహత్మాగాంధీ జా తీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 2024- 25కి సంబంధించి జిల్లాలో 57లక్షల పనిదినాలు లక్ష్య ంగా ఇప్పటివరకు 44.02లక్షల పనులు పూర్తిచేసిన ట్లు జిల్లా డ్వామా పీడీ ఎస్‌.మధుసూధనరావు అన్నా రు.

జిల్లాలో 44.02 లక్షల పనిదినాలు పూర్తి : డ్వామా పీడీ
అంబాజీపేటలో ఉపాధి సామాజీక తనిఖీలో పాల్గొన్న పీడీ మధుసూధనరావు

అంబాజీపేట, సెప్టెంబరు 20: మహత్మాగాంధీ జా తీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 2024- 25కి సంబంధించి జిల్లాలో 57లక్షల పనిదినాలు లక్ష్య ంగా ఇప్పటివరకు 44.02లక్షల పనులు పూర్తిచేసిన ట్లు జిల్లా డ్వామా పీడీ ఎస్‌.మధుసూధనరావు అన్నా రు. అంబాజీపేట మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో జీవీ సరోవర్‌ అధ్యక్షతన 16వ ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక సభను శుక్రవా రం నిర్వహించారు. జిల్లాలో నిర్వహించే పనుల నిమి త్తం ఏడాది రూ.156 కోట్లు వేతనాలుగా నిర్ణయించగా ఇప్పటివరకు రూ.130కోట్లు వేతనాలు ఉపాధి కూలీల కు ఆయా అకౌంట్లోకి వేశామన్నారు. జిల్లాలో 100 రోజులు పనిచేసిన వారు 2285 మంది ఉన్నారన్నారు. 562మంది కుటుంబాలు 100రోజులు పనిచేసిన మం డలం మల్కిపురం మండల జిల్లాలో మొదటి స్థా నంలో ఉండగా, కేవలం 11 కుటుంబాలు మాత్రమే 100రోజులు పనులుచేసి అమలాపురం ఆఖరి స్థానం లో ఉందన్నారు. అంబాజీపేట మండలానికి సంబంధించి శుక్రవారం నిర్వహించిన సామాజిక తనిఖీ వేదికలో తనిఖీ సిబ్బంది వివరాలను వెల్లడించారు. ఎస్‌ఆర్పీ ఎస్‌.మాధవ్‌ ఆధ్వర్యంలో డీఆర్పీలు ఆయా గ్రామాల్లో చేపట్టిన తనిఖీ వివరాలను సమావేశంలో వెల్లడించారు. 774 పనులు చేపట్టగా మెటీరియల్‌ వర్కులు 19, గోకులం శాల ఒకటి పూర్తిచేశామన్నా రు. కూలీలకు వేతనాల రూపంలో 7.49కోట్లు చెల్లించామన్నారు. సోషల్‌ ఆడిట్‌లో రూ.7,400 ఆయా గ్రా మాల ఫీల్డ్‌అసిసెంట్ల బకాయి పడ్డారని వివరించారు. ఆయా ఫీల్డ్‌ అసిస్టెంట్ల నుంచి సొమ్మును రికవరీ చేశామన్నారు. ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, వైస్‌ఎంపీపీ నేతల నాగరాజు, ఎంపీటీసీలు ముత్తాబత్తుల ప్రశాంత్‌, మట్టా పార్వతీ, జిల్లా విజిలెన్స్‌ అధికారి కర్రి భీమేశ్వరరావు, అంబుడ్స్‌మెన్‌ ఏవీ శ్రీనివాస్‌, ఏపీవో అడపా వెంకటకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 12:27 AM