రజకులపై దాడులు అరికట్టాలి
ABN , Publish Date - Dec 06 , 2024 | 01:35 AM
గ్రామీణ ప్రాంతాల్లో రజకులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కె.రామారావు డిమాండ్ చేశారు.
ఆత్రేయపురం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో రజకులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కె.రామారావు డిమాండ్ చేశారు. గురువారం రావులపాలెం వచ్చిన ఆయన్ను నియోజకవర్గ రజక సేవా సంస్థ సభ్యులు కలిశారు. ఆత్రేయపురం మండలం రాజవరం గ్రామంలో రజకులు ఏర్పాటు చేసిన షెడ్‌ను తొలగించిన ఘటనను ఆయనకు తెలిపారు. రాజవరం రజక సంఘ సభ్యుల ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా షెడ్‌ను నిర్మించుకుని ప్రతి ఏటా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ షెడ్‌ను సర్పంచ్ ఎలాంటి సమాచారం ఇవ్వ కుండా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశా రు. అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావును కలిసి రాజవరంలో జరిగిన సంఘటనను తెలిపారు. ఎమ్మెల్యే స్పందించి సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీశారు. రజకుల షెడ్‌ను యఽథావిఽధిగా నిర్మించాలని సర్పంచ్‌కు సూచించారు. సమస్యను పరిష్కరిస్తామని రజక సంఘ నాయకులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు పెరవలి వెంకటేశ్వరరావు, గణేష్, మాగాపు విజయకుమార్, ఎన్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.