Share News

కుక్కల కాటుకు ఆవుదూడ బలి

ABN , Publish Date - Aug 20 , 2024 | 01:01 AM

ఆదివారం రాత్రి ఆరు నెలల ఆవుదూడను కుక్కలు చంపేశాయి.

కుక్కల కాటుకు ఆవుదూడ బలి

ఉప్పలగుప్తం, ఆగస్టు 19: ఆదివారం రాత్రి ఆరు నెలల ఆవుదూడను కుక్కలు చంపేశాయి. ఉప్పలగుప్తం పంచాయతీ చీకట్లపాలెంలో సలాది శ్రీనివాసరావుకు చెందిన ఆవుదూడ మెడ వద్ద, ఇతర భాగాల్లోనూ వీధి కుక్కలు కరిచి తీవ్రంగా గాయపరిచాయి. కొట్టుకుంటున్న దూడకు చికిత్స చేయించేందుకు యజమాని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పశువైద్యాధికారి నాగేశ్వరరావు ఆవుదూడ చనిపోయినట్టు ధ్రువీకరించారు. కుక్కలను చంపించే అధికారం పంచాయతీకి లేదని, కుక్కల నియంత్రణకు కుటుంబ నియంత్రణ పద్ధతులను అమలు చేయడమే పరిష్కారమని ఇన్‌చార్జి ఈవోపీఆర్డీ తిక్కిరెడ్డి రామకృష్ణ తెలిపారు.

Updated Date - Aug 20 , 2024 | 01:01 AM