నాణ్యత లేకుండా పనులు
ABN , Publish Date - Feb 05 , 2024 | 12:37 AM
రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్ రామ్ అనుచరుల కమీషన్ల కక్కుర్తి వల్ల అభివృద్ధి పనుల్లో డొల్లతనం కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు.
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 4: రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్ రామ్ అనుచరుల కమీషన్ల కక్కుర్తి వల్ల అభివృద్ధి పనుల్లో డొల్లతనం కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం పుష్కరప్లాజాను ఆదివారం టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అక్కడ పైకి లేచి ప్రమాదకరంగా ఉన్న టైల్స్‌ను చేశారు. పుష్కరప్లాజా ఏర్పాటులో నాణ్యత ప్రమాణాలు లోపించాయని ఆరోపించారు. ప్రజాధనంతో చేపట్టిన చేపడుతున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదన్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృధ్ది పనులు నాణ్యతగా ఉండడం వల్ల నేటికీ చెక్కుచెదరలేన్నారు. కమీషన్లకు కుక్కర్తిపడి ఎంపీ అనుచరులు నాణ్యత తోపాలతో పనులు చేసినా భరత్ రామ్ ఒత్తిడి వల్ల వారిపై కమిషనర్ ఎటువంటి చర్యలు తీసుకోలేన్నారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, టీడీపీ కోశాధికారి శెట్టి జగదీష్, టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు తవ్వా రాజా, నాయకులు మాటూరి సిద్దు, ఎంఎన్.రావు, నల్లం ఆనంద్, గ్రంఽధి రాజా,కొత్త రాజేష్, సిహెచ్ శివ, పింకేష్, నారాయణ పాల్గొన్నారు.